Telugu Global
National

ఆఖ‌రి క్ష‌ణంలో పెళ్లికొడుకులు న‌చ్చ‌లేద‌న్నారు!

హ‌ర్యానాలోని ఫ‌తెహాబాద్ జిల్లాలో ఇద్ద‌రు అక్కాచెల్లెళ్లు పీట‌ల‌వ‌ర‌కు వ‌చ్చాక‌ చివ‌రి నిముషంలో పెళ్లి వ‌ద్ద‌ని చెప్పేశారు. ఫొటోల్లో పెళ్లి కొడుకుల‌ను చూసి ఒకే చెప్పిన ఆ అమ్మాయిలు,  ఫొటోల్లో అందంగా క‌నిపించిన పెళ్లి కొడుకులు నిజంగా చూస్తే న‌ల్ల‌గానూ, త‌మ‌కంటే చాలా పెద్ద‌వ‌య‌సువారిలా  ఉన్నారంటూ తిర‌స్క‌రించారు. వారి త‌ల్లి ఒక బాబా చెప్ప‌డంతో ఈ పెళ్లిళ్లు కుదిర్చింది. హ‌ఠాత్తుగా అమ్మాయిలు ఎదురుతిర‌గ‌టంతో పెళ్లి కుమారుల త‌ర‌పువారు ఖంగుతిన్నారు. త‌మ కుమార్తెల‌కు న‌చ్చ‌చెప్పాల‌ని కుటుంబ స‌భ్యులు ఎంతగా ప్ర‌య‌త్నించినా […]

ఆఖ‌రి క్ష‌ణంలో పెళ్లికొడుకులు న‌చ్చ‌లేద‌న్నారు!
X

హ‌ర్యానాలోని ఫ‌తెహాబాద్ జిల్లాలో ఇద్ద‌రు అక్కాచెల్లెళ్లు పీట‌ల‌వ‌ర‌కు వ‌చ్చాక‌ చివ‌రి నిముషంలో పెళ్లి వ‌ద్ద‌ని చెప్పేశారు. ఫొటోల్లో పెళ్లి కొడుకుల‌ను చూసి ఒకే చెప్పిన ఆ అమ్మాయిలు, ఫొటోల్లో అందంగా క‌నిపించిన పెళ్లి కొడుకులు నిజంగా చూస్తే న‌ల్ల‌గానూ, త‌మ‌కంటే చాలా పెద్ద‌వ‌య‌సువారిలా ఉన్నారంటూ తిర‌స్క‌రించారు. వారి త‌ల్లి ఒక బాబా చెప్ప‌డంతో ఈ పెళ్లిళ్లు కుదిర్చింది. హ‌ఠాత్తుగా అమ్మాయిలు ఎదురుతిర‌గ‌టంతో పెళ్లి కుమారుల త‌ర‌పువారు ఖంగుతిన్నారు. త‌మ కుమార్తెల‌కు న‌చ్చ‌చెప్పాల‌ని కుటుంబ స‌భ్యులు ఎంతగా ప్ర‌య‌త్నించినా వారు విన‌లేదు. గ్రామ‌పెద్ద‌లు చెప్పినా వ‌ద్ద‌నే స‌మాధానం ఇచ్చారు. మ‌న‌సు మార్చుకోలేక‌పోయిన అక్కాచెల్లెళ్లు పెళ్లిమండ‌పం వ‌దిలేసి అలిగ‌ర్ లోని త‌మ ఇంటికి వెళ్లిపోయారు.

First Published:  22 April 2016 6:35 AM IST
Next Story