Telugu Global
Others

తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకు 2 శాతమేనా?

తెలంగాణలో తెలుగుదేశం ఓటు బ్యాంకు మరీ దిగజారిందా? ఎప్పుడూ లేనివిధంగా కేవలం 2 శాతానికి పడిపోయిందని.. ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఈ మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంతగా టీడీపీ ఓటు బ్యాంకు పడిపోయిందని గులాబీ పార్టీ చెబుతోంది. పాలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం తరువాత.. అధికార పార్టీ అక్కడ విజయావకాశాలపై ఓ సర్వే చేయించింది. ఈ సర్వేలో ప్ర‌జ‌ల నుంచి తమ పార్టీకి అనూహ్య ఆదరణ లభించిందని చెబుతోంది […]

తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకు 2 శాతమేనా?
X
తెలంగాణలో తెలుగుదేశం ఓటు బ్యాంకు మరీ దిగజారిందా? ఎప్పుడూ లేనివిధంగా కేవలం 2 శాతానికి పడిపోయిందని.. ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఈ మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంతగా టీడీపీ ఓటు బ్యాంకు పడిపోయిందని గులాబీ పార్టీ చెబుతోంది. పాలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం తరువాత.. అధికార పార్టీ అక్కడ విజయావకాశాలపై ఓ సర్వే చేయించింది. ఈ సర్వేలో ప్ర‌జ‌ల నుంచి తమ పార్టీకి అనూహ్య ఆదరణ లభించిందని చెబుతోంది గులాబీ పార్టీ. ఎన్నడూ లేనంతం 54 శాతం ఓట్లు వస్తాయని ధీమాగా చెబుతోంది. కాంగ్రెస్కు కేవలం 16 శాతం, ఇక ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో హవా నడిపించిన తెలుగుదేశానికి కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వే వెల్లడించిందని అధికార పార్టీ వివరించింది. ఈ లెక్క‌న టీడీపీకి పాలేరులో మ‌రోసారి డిపాజిట్ గ‌ల్లంత‌వుతుంద‌ని ప‌రోక్షంగా వెల్ల‌డించింది టీఆర్ ఎస్‌.
రేవంత్ రెడ్డి స‌ర్వేలూ టీఆర్ ఎస్‌కే అనుకూలం.!
ఇటీవ‌ల తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కూడా రాష్ట్రంలో ఓ స‌ర్వే చేయించార‌ట‌. అందులో తెలంగాణ రాష్ట్ర స‌మితి ఓటు బ్యాంకు 66 శాతం నుంచి 46 శాతానికి ప‌డిపోయింద‌ని తేలింద‌ని చెప్పారు. ఈ స‌ర్వే ఎప్పుడు ఎక్క‌డ ఎలా జ‌రిగిందో అన్న వివ‌రాలు మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఈ స‌ర్వే ద్వారా తెలంగాణ రాష్ట్ర స‌మితికే అనుకూలంగా మాట్లాడారు. అదెలా? అంటే.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. తెలంగాణ‌లో ఉన్న పార్టీల‌కు మిగిలిన 56 శాతం ఓట్లు పోయినా.. 46 శాతం టీఆర్ ఎస్‌కే వ‌స్తాయి. ఈ స‌ర్వే వివ‌రాలు ఏప్రిల్ రెండోవారంలోనే స్వ‌యంగా రేవంతే వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఈ లెక్క ప్ర‌కారం.. చూసినా గులాబీ పార్టీకి పాలేరు విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌మే అవుతుంద‌ని కారు పార్టీ నాయ‌కులు ధీమాగా ఉన్నారు. రెండు పార్టీల స‌ర్వేలు కారు జోరును ముందే ఊహించిన‌ట్ల‌యితే.. మ‌రి ఈ ఉప ఎన్నిక ఏక‌ప‌క్షంగా సాగుతుందా? అన్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.
First Published:  22 April 2016 8:48 AM IST
Next Story