కేటీఆర్‌పై మరో భారం!
ఐటీ- గ్రామీణ మంత్రిగా మంచి మార్కులు సాధించిన కేటీఆర్‌కు మరో బాధ్యత అప్పగించారు సీఎం కేసీఆర్. ఈసారి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలేరు ఉప ఎన్నికకు ఆయన్ను ఇన్‌ఛార్జిగా నియమించడం విశేషం. సీఎం తనయుడిగా కాకుండా తనదైన పనితీరుతో అందరినీ మెప్పించి పలు అవార్డులు సాధించిన కేటీఆర్… ఇటీవల గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను సైతం సమర్ధంగా నెరవేర్చిన సంగతి తెలిసిందే. ఆ సంతోషంతో తన కుమారుడికి అదనంగా మున్సిపల్ శాఖను కూడా అప్పగించారు కేసీఆర్. తాజాగా పాలేరు […]
BY sarvi21 April 2016 3:21 AM GMT
X
sarvi Updated On: 21 April 2016 3:31 AM GMT
ఐటీ- గ్రామీణ మంత్రిగా మంచి మార్కులు సాధించిన కేటీఆర్‌కు మరో బాధ్యత అప్పగించారు సీఎం కేసీఆర్. ఈసారి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలేరు ఉప ఎన్నికకు ఆయన్ను ఇన్‌ఛార్జిగా నియమించడం విశేషం. సీఎం తనయుడిగా కాకుండా తనదైన పనితీరుతో అందరినీ మెప్పించి పలు అవార్డులు సాధించిన కేటీఆర్… ఇటీవల గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను సైతం సమర్ధంగా నెరవేర్చిన సంగతి తెలిసిందే. ఆ సంతోషంతో తన కుమారుడికి అదనంగా మున్సిపల్ శాఖను కూడా అప్పగించారు కేసీఆర్.
తాజాగా పాలేరు ఉప ఎన్నికకు బాధ్యుడిగా కేటీఆర్‌ను నియమించడంతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో ఉద్యమపార్టీకి ప్రజలు పట్టం కడతారా? అన్నది మొదటి నుంచి అనుమానంగా సాగింది. కానీ, కేటీఆర్ ఆ విమర్శలను పటాపంచలు చేస్తూ..ప్రచారంలో దూసుకుపోయారు. పాతబస్తీలో ఉర్దూలో, ఐటీ ఏరియాల్లో ఆంగ్లంలో, తెలంగాణ బస్తీల్లో తెలంగాణ యాసలో, ఆంధ్ర ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారి యాసలో మాట్లాడి ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. అందుకే, అన్న మాటప్రకారం..100కు 100 కాకపోయినా.. 99 స్థానాలను గెలిపించుకుని గ్రేటర్‌లో కొత్త చరిత్ర లిఖించారు.
గ్రేటర్.. ఖమ్మంలో ఒకేలాంటి పరిస్థితులు..
హైదరాబాద్, ఖమ్మం రాజకీయంగా ఒకే పరిస్థితులు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో హైదరాబాద్ ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ నుంచి ఒక్కోక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. రెండు చోట్లా.. సెటిలర్లు అధికం. గ్రేటర్ ఎన్నికలకు ముందు కూడా హైదరాబాద్‌లో టీఆర్ ఎస్ పరిస్థితి ఇలాగే ఉండేది. కానీ, కేసీఆర్ పనితీరు నచ్చడం, ఏపీలో చంద్రబాబు ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకపోవడంతో ప్రజలు కేసీఆర్‌కే పట్టం కట్టారు. సెటిలర్లకు అండగా ఉంటామన్న నినాదంతో గ్రేటర్ ఎన్నికల్లో బరిలోకి దిగిన టీడీపీని ప్రజలు నమ్మలేదు. మరీ దారుణంగా కేవలం ఒక్కటంటే ఒకటే స్థానం కట్టబెట్టి ఆ పార్టీపై వారికున్న వ్యతిరేకతను చాటుకున్నారు. అయితే, ఇప్పటికే పాలేరు పరిస్థితులను అధ్యయనం ప్రారంభించిన కేటీఆర్.. వ్యూహాలు, ప్రతివ్యూహాలకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.
Next Story