మోడీకీ...మైనపు మోడీకి తేడాలున్నాయి!
అంతర్జాతీయ మైనపు విగ్రహాల మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో నెలకొల్పేందుకు ప్రధాని మోడీ విగ్రహాల తయారీ పూర్తయింది. మోడీ తరుచుగా కనిపించే క్రీమ్ కలర్ చుడీదార్, స్లీవ్‌లెస్ జాకెట్‌ని ధరించి… నమస్కారం పెడుతున్న భంగిమలో వీటిని తయారుచేశారు. లండన్‌తో పాటు సింగపూర్, హాంగ్‌కాంగ్, బ్యాంకాక్ మ్యూజియంలలో కూడా వీటిని నెలకొల్పుతారు. ఒక్కో విగ్రహానికి అయిన ఖర్చు మన కరెన్సీలో 1.5కోట్ల రూపాయలు. విగ్రహాలు మోడీని ప్రతిబింబిస్తూ జీవకళ ఉట్టిపడుతున్నాయి. అయితే మోడీ నిజరూపానికి విగ్రహానికి కొన్ని తేడాలున్నాయనేది కొంతమంది […]
అంతర్జాతీయ మైనపు విగ్రహాల మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో నెలకొల్పేందుకు ప్రధాని మోడీ విగ్రహాల తయారీ పూర్తయింది. మోడీ తరుచుగా కనిపించే క్రీమ్ కలర్ చుడీదార్, స్లీవ్‌లెస్ జాకెట్‌ని ధరించి… నమస్కారం పెడుతున్న భంగిమలో వీటిని తయారుచేశారు. లండన్‌తో పాటు సింగపూర్, హాంగ్‌కాంగ్, బ్యాంకాక్ మ్యూజియంలలో కూడా వీటిని నెలకొల్పుతారు. ఒక్కో విగ్రహానికి అయిన ఖర్చు మన కరెన్సీలో 1.5కోట్ల రూపాయలు. విగ్రహాలు మోడీని ప్రతిబింబిస్తూ జీవకళ ఉట్టిపడుతున్నాయి. అయితే మోడీ నిజరూపానికి విగ్రహానికి కొన్ని తేడాలున్నాయనేది కొంతమంది వాదన. మోడీ కంటే మైనపు విగ్రహం కాస్త పొడుగ్గా ఉందని, మోడీకి ఉన్న జుట్టుకంటే విగ్రహానికి తలకట్టు కాస్త నిండుగా ఉందని, మోడీ శరీరరంగు కంటే విగ్రహం రంగు కాస్త లైట్‌గా ఉందనిపిస్తోందని వారు చెబుతున్నారు. ఏదిఏమైనా విగ్రహాలపై స్పందించిన మోడీ, బ్రహ్మ సృష్టించిన రూపానికి మేడమ్ టుస్సాడ్స్ కళాకారులు ప్రతిసృష్టి చేశారంటూ మెచ్చుకున్నారు.