సునాయాస మరణంకోసం గూగుల్లో వెతికాడు....తనువు చాలించాడు!
ఉన్నత చదువు, సంపాదించే తెలివితేటలు, మంచి ఆరోగ్యం….ఆనందంగా బతకడానికి ఇవే చాలా ఎక్కువ…అనేది నిజం. హైదరాబాద్, ఎస్‌ఆర్‌నగర్ డీకే రోడ్డులో నివాసముంటున్న లక్కీ గుప్తా (32)కి మాత్రం జీవితం అంటే ఎవరికీ సాధ్యం కాని ఓ గొప్ప విజయాన్ని సాధించడం. సాధించలేకపోతే మరణించడం. అందుకే అనుకున్నది సాధించలేకపోయిన లక్కీ గుప్తాని నిరాశా నిస్పృహలు బతకనీయలేదు. అతను బుధవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన లక్కీ గుప్తా వాట్సాప్‌ని మించిన సాఫ్ట్‌వేర్‌ని కనుగొనాలనుకున్నాడు. […]
ఉన్నత చదువు, సంపాదించే తెలివితేటలు, మంచి ఆరోగ్యం….ఆనందంగా బతకడానికి ఇవే చాలా ఎక్కువ…అనేది నిజం. హైదరాబాద్, ఎస్‌ఆర్‌నగర్ డీకే రోడ్డులో నివాసముంటున్న లక్కీ గుప్తా (32)కి మాత్రం జీవితం అంటే ఎవరికీ సాధ్యం కాని ఓ గొప్ప విజయాన్ని సాధించడం. సాధించలేకపోతే మరణించడం. అందుకే అనుకున్నది సాధించలేకపోయిన లక్కీ గుప్తాని నిరాశా నిస్పృహలు బతకనీయలేదు. అతను బుధవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన లక్కీ గుప్తా వాట్సాప్‌ని మించిన సాఫ్ట్‌వేర్‌ని కనుగొనాలనుకున్నాడు. అందుకోసం పలు టెక్నికల్ పరికరాలను కొనుగోలు చేశాడు. తీవ్రంగా శ్రమించాడు. అయితే ఎంత ఖర్చుపెడుతున్నా, ఎంత కష్టపడుతున్నా అనుకున్నది సాధించలేకపోయాడు. ఆ దిగులుతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. నెలరోజులుగా అదే బాధతో ఒంటరిగా గడుపుతున్నాడు. చివరికి జీవితం ముగించాలనుకున్నాడు. అయితే సునాయాసంగా మరణించాలని ఆశించాడు. అందుకు ఏ మార్గాలున్నాయో తెలుసుకోవడానికి గూగుల్లో వెతికాడు. నైట్రోజన్ గ్యాస్‌ని పీలిస్తే త్వరగా చనిపోతారని తెలుసుకుని మార్చి 17వ తేదీన రూ.5వేలు డిపాజిట్ కట్టి బాలానగర్‌లోని ఓ కంపెనీ నుంచి గ్యాస్ సిలిండర్‌ను అద్దెకు తెచ్చుకున్నాడు.
బుధవారం తెల్లవారు జామున చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అదే విషయాన్ని లక్కీ గుప్తా సూసైడ్ నోట్‌లో రాశాడు. అనుకున్నట్టుగానే బుధవారం తెల్లవారు జామున నాలుగున్నరకు ముఖానికి ప్లాస్టిక్ కవర్‌ని తొడుక్కుని గ్యాస్‌ని లోపలికి పంప్ చేసుకుని ఊపిరాడక మరణించాడు.
బుధవారం మధ్యాహ్నం మూడింటివరకు లక్కీ గుప్తా గదిలోంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి విగతజీవిగా కనిపించాడు. సులభంగా చనిపోవాలనే ఉద్దేశంతో ఇంటర్నెట్‌లో చూసి నైట్రోజన్ గ్యాస్ తెచ్చుకున్నట్టుగా సూసైడ్ నోట్‌లో రాశాడు. ఎవరూ బాధపడవద్దని, ప్రశాంతంగా ఉండమని కోరాడు. సిలిండర్‌కి డబ్బు కట్టినట్టుగా, డిపాజిట్ డబ్బుని తిరిగి తీసుకోవాల్సిందిగా లేఖలో రాశాడు. లేఖతో పాటు తాను కొనుగోలు చేసిన రశీదుని జతచేసి పెట్టాడు. ఏదిఏమైనా లక్కీ గుప్తా తన కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. జీవితానికి జీవించడమనే లక్ష్యం తరువాతే ఏవైనా. లక్ష్యాలు ఆశయాలు…ఇవన్నీ జీవితాన్ని ముందుకు నడిపించడానికి ఉద్దేశించినవి. ఫుల్‌స్టాప్ పెట్టడానికి కాదు. ఒక ప్రాణం నిలిచి ఉండటం కంటే గొప్పలక్ష్యం ప్రపంచంలో మరొకటి ఉంటుందా…లక్కీ గుప్తాలా నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యా ఆలోచనలు చేసేవారు ఎవరైనా గుర్తుంచుకోవలసిన విషయాలు ఇవి.