వాళ్లిద్దరి మధ్య ఈ హీరో బుక్కయిపోయాడు...
పంపిణీదారులు, పూరి జగన్నాధ్ మధ్య చిన్నపాటి వార్ నడుస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. తనపై డిస్ట్రిబ్యూర్లు చేయి చేసుకున్నారంటూ పూరీ ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాడు. తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కూడా రివర్స్ అయ్యారు. ప్రస్తుతం పరిశ్రమలో ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. అంతా డిస్ట్రిబ్యూటర్లు, పూరి వంకే చూస్తున్నారు. ఒక దశలో పూరి నెక్ట్స్ సినిమాలను పంపిణీ చేయకూడదని డిస్ట్రిబ్యూటర్లు తీర్మానించుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది. పంపిణీదారులు అన్నంత పని చేస్తే […]
BY sarvi20 April 2016 4:44 AM IST
X
sarvi Updated On: 20 April 2016 5:04 AM IST
పంపిణీదారులు, పూరి జగన్నాధ్ మధ్య చిన్నపాటి వార్ నడుస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. తనపై డిస్ట్రిబ్యూర్లు చేయి చేసుకున్నారంటూ పూరీ ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాడు. తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కూడా రివర్స్ అయ్యారు. ప్రస్తుతం పరిశ్రమలో ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. అంతా డిస్ట్రిబ్యూటర్లు, పూరి వంకే చూస్తున్నారు. ఒక దశలో పూరి నెక్ట్స్ సినిమాలను పంపిణీ చేయకూడదని డిస్ట్రిబ్యూటర్లు తీర్మానించుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది. పంపిణీదారులు అన్నంత పని చేస్తే పూరీకి ఏం కాదు… మధ్యలో బుక్కయిపోయేది కల్యాణ్ రామే. అవును… పూరి నెక్ట్స్ చేయాల్సిందే కల్యాణ్ రామ్ సినిమానే. ఆ సినిమాకు తన పారితోషికం తీసుకొని పూరీ సైడైపోతాడు. కానీ సినిమా ఆగిపోతే నష్టపోయేది కల్యాణ్ రామే. ఎందుకంటే… తన ప్రాజెక్టులకు తనే నిర్మాత. మరీ ముఖ్యంగా కిక్-2, షేర్ లాంటి రెండు ఫ్లాపులతో బాగా నష్టాల్లో ఉన్నాడు కల్యాణ్ రామ్. ఇలాంటి టైమ్ లో తన సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అడ్డుకుంటే నిండా మునిగిపోతాడు. అందుకే… ఈ సమస్య వీలైనంత తొందరగా సమసిపోవాలని అందరికంటే ముందు కల్యాణ్ రామ్ కోరుకుంటున్నాడు.
Next Story