పార్టీకి దూరంగా ఉన్న మాట వాస్తవమే గానీ…
తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై ప్రకాశం జిల్లా వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఆయనతో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు తాను దూరంగా ఉంటున్న మాట వాస్తవమేనని చెప్పిన బాలినేని… పార్టీ వీడేది మాత్రం లేదని చెప్పారు. వ్యక్తిగత ఇబ్బందులతోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. తాను ఒకప్పుడు మంత్రి పదవి వదలుకుని వైసీపీలోకి వచ్చినవాడినని… జగన్ వెంటే ఉంటానన్నారు. […]
తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై ప్రకాశం జిల్లా వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఆయనతో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు తాను దూరంగా ఉంటున్న మాట వాస్తవమేనని చెప్పిన బాలినేని… పార్టీ వీడేది మాత్రం లేదని చెప్పారు. వ్యక్తిగత ఇబ్బందులతోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. తాను ఒకప్పుడు మంత్రి పదవి వదలుకుని వైసీపీలోకి వచ్చినవాడినని… జగన్ వెంటే ఉంటానన్నారు. పార్టీలో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలకు పార్టీ వీడే వ్యక్తిని తాను కాదన్నారు. జగన్ తనకు మంచి ప్రాధాన్యతే ఇచ్చారన్నారు. జిల్లాలో పార్టీ బాధ్యతలు మొత్తం చూసుకోవాల్సిందిగా జగన్ కోరారని అయితే తానే వ్యక్తిగత కారణాల వల్ల ఆ పని చేయలేకపోయానన్నారు. జగన్ నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. పార్టీ వీడుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చెప్పారు. తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా వార్తలు రాయడం సరికాదన్నారు.
Click on Image to Read: