ఈయన వాదన విచిత్రంగానే ఉంది
ఒక వ్యక్తి తాను కొండను మోస్తా అని ముందుకొచ్చాడట. అందరూ షాక్ అయిపోయి ఆ వ్యక్తి కొండను ఎలా మోస్తాడా? అని ఆశ్చర్యంగా ఆతృతగా చూశారట. తీరా కొండను ఇక మోయండి అనే సరికి మీరంతా ఆ కొండను తెచ్చి నా భుజాల మీద పెట్టండి అప్పుడు మోసేస్తా అన్నాడట. అలా ఉంది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జలీల్‌ఖాన్ వాదన. నిత్యం తాను రాజీనామాకు సిద్ధం అని పదేపదే ప్రకటిస్తున్నారు. కానీ రాజీనామా మాత్రం చేయడం లేదు. ఒక […]
ఒక వ్యక్తి తాను కొండను మోస్తా అని ముందుకొచ్చాడట. అందరూ షాక్ అయిపోయి ఆ వ్యక్తి కొండను ఎలా మోస్తాడా? అని ఆశ్చర్యంగా ఆతృతగా చూశారట. తీరా కొండను ఇక మోయండి అనే సరికి మీరంతా ఆ కొండను తెచ్చి నా భుజాల మీద పెట్టండి అప్పుడు మోసేస్తా అన్నాడట. అలా ఉంది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జలీల్‌ఖాన్ వాదన. నిత్యం తాను రాజీనామాకు సిద్ధం అని పదేపదే ప్రకటిస్తున్నారు. కానీ రాజీనామా మాత్రం చేయడం లేదు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిపోయాక రాజీనామా చేసి తిరిగి గెలవడం అన్నది నిజాయితీపరులైన నేతలు చేయాల్సిన పని.
జలీల్‌ఖాన్ మాత్రం రాజీనామాకు సిద్ధమంటారే గానీ రాజీనామా మాత్రం చేయరు. పైగా తాను ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ మీదే సవాల్ విసిరారు. ”నన్ను రాజీనామా చేయమంటున్నారు. చేస్తా. తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తా. అలా గెలిస్తే వైసీపీని మూసేస్తారా” అని ప్రశ్నిస్తున్నారు. అయినా వైసీపీని ఉంచుకుంటారో… మూసుకుంటారో ఆ పార్టీ నాయకత్వం ఇష్టం. టీడీపీ అభివృద్ధిని చూసి పార్టీ ఫిరాయించినట్టు చెబుతున్న జలీల్‌ఖాన్ నిజాయితీగా అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. అది ఆయన కనీస నైతిక విలువ. కానీ అలా చేయకుండా వైసీపీని మూస్తేస్తారా అని ఛాలెంజ్ చేయడం విచిత్రమే. బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఉత్తరాంధ్రలో నేతలు వైసీపీని వీడుతున్నారని కూడా జలీల్ ఖాన్ విమర్శించారు.
Click on Image to Read: