Telugu Global
Cinema & Entertainment

సెంచరీ సినిమా పని ప్రారంభించిన దేవి

బాలకృష్ణ చేయబోతున్న వందో సినిమాకు సంబంధించి సంగీత దర్శకత్వ బాధ్యతల్ని దేవిశ్రీప్రసాద్ కు అప్పగించారు. చారిత్రక నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా దేవిశ్రీకి ఓ సవాల్ లాంటిది. మరీ ముఖ్యంగా ఎక్కడా కాంప్రమైజ్ కాని క్రిష్ ను మెప్పించి ట్యూన్స్ అందించడం దేవిశ్రీకి కత్తిమీద సామే. అందుకే మొట్టమొదట ఈ సినిమా పనినే ప్రారంభించాడు దేవి. సినిమా సంగీతానికి సంబంధించి ఇప్పటికే దేవీకి కొన్ని సూచనలు చేశాడు క్రిష్. అలనాటి నర్తనశాల, శ్రీకృష్ణతులాభారం, మాయాబజార్ లాంటి సినిమాల్లో […]

సెంచరీ సినిమా పని ప్రారంభించిన దేవి
X
బాలకృష్ణ చేయబోతున్న వందో సినిమాకు సంబంధించి సంగీత దర్శకత్వ బాధ్యతల్ని దేవిశ్రీప్రసాద్ కు అప్పగించారు. చారిత్రక నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా దేవిశ్రీకి ఓ సవాల్ లాంటిది. మరీ ముఖ్యంగా ఎక్కడా కాంప్రమైజ్ కాని క్రిష్ ను మెప్పించి ట్యూన్స్ అందించడం దేవిశ్రీకి కత్తిమీద సామే. అందుకే మొట్టమొదట ఈ సినిమా పనినే ప్రారంభించాడు దేవి. సినిమా సంగీతానికి సంబంధించి ఇప్పటికే దేవీకి కొన్ని సూచనలు చేశాడు క్రిష్. అలనాటి నర్తనశాల, శ్రీకృష్ణతులాభారం, మాయాబజార్ లాంటి సినిమాల్లో ఎలాంటి సంగీతం వినిపించిందో… ఆ శైలిలో మ్యూజిక్ కంపోజ్ చేస్తూనే… దేవి మార్క్ కనిపించేలా ట్యూన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశాడట. నిజానికి సంగీతం అంతా ఎలక్ట్రానిక్స్ తో నిండిపోయిన ఈ రోజుల్లో…. సంప్రదాయ వాయిద్యాలతో వీనులవిందైన సంగీతాన్ని సృష్టించడం కష్టమైన పనే. ఎందుకంటే… సంప్రదాయ వాయిద్యాలతో సంగీతం పుట్టించినప్పుడు… రికార్డింగ్ స్టుడియోలో జిమ్మిక్కులు చేయడానికి కుదరదు. ఉన్నది ఉన్నట్టు ప్రొడ్యూస్ చేయాలి. మెలొడీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం దేవిశ్రీ అదే పనిలో ఉన్నాడు.
First Published:  19 April 2016 4:53 AM IST
Next Story