లచ్చన్న కామెంట్లతో తెలుగు తమ్ముళ్లు డీలా!
పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ సీట్ల పెంపును ఆసరాగా తీసుకుని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని ఆయన తప్పుబట్టారు. రెండు రాష్ర్టాల్లో ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని ఇటు టీఆర్ ఎస్, అటు టీడీపీలు ఆయా రాష్ర్టాల్లో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన కామెంట్లు రెండు రాష్ర్టాల రాజకీయ నేతలను ఆలోచించేలా చేస్తున్నాయి. ఆయన గులాబీ పార్టీని విమర్శించారంటే అర్థం ఉంది. కానీ, […]
BY sarvi19 April 2016 12:11 AM GMT
X
sarvi Updated On: 19 April 2016 1:26 AM GMT
పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ సీట్ల పెంపును ఆసరాగా తీసుకుని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని ఆయన తప్పుబట్టారు. రెండు రాష్ర్టాల్లో ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని ఇటు టీఆర్ ఎస్, అటు టీడీపీలు ఆయా రాష్ర్టాల్లో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన కామెంట్లు రెండు రాష్ర్టాల రాజకీయ నేతలను ఆలోచించేలా చేస్తున్నాయి. ఆయన గులాబీ పార్టీని విమర్శించారంటే అర్థం ఉంది. కానీ, పక్కనున్న రాష్ట్ర సీఎం వీరికి అనుంగు అనుచరుడు కదా? మరి ఆయన్ను ఎందుకు విమర్శించారని తెలంగాణ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. లక్ష్మన్ వ్యాఖ్యలు సమంజసమే అయినా.. ఓటుకు నోటు కేసులో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మౌనం వహించారు. మరి దాంతో పోలిస్తే.. పార్టీ ఫిరాయింపులు చాలా చిన్న విషయం మరి దీనిపై ఎందుకు మాట్లాడుతున్నారని తెలుగుతమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. లక్ష్మణ్ వ్యాఖ్యలు భవిష్యత్తులో టీఆర్ ఎస్ తో పొత్తుకు సంకేతమా? అన్న సందేహాలు కూడా లేవనెత్తుతున్నారు. ఇప్పటికే బీజేపీ టీడీపీ ని కాదని వరంగల్, ఖమ్మం, సిద్ధిపేట పురపాలికలలో పోటీ చేసింది.
Next Story