ఏపీలో ప్రజలకు మజ్జిగ హెరిటేజ్ కోసమేనా?
చల్లకొచ్చి ముంత దాచడమెందుకు? అంటారు పెద్దలు.. ఏదైనా అడుగుదామని వచ్చి అడగలేకపోతున్న వారిని ఉద్దేశించి అనే మాటలివి. ఎండవేడితో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనాన్ని కలిగించే చర్యల్లో భాగంగా మజ్జిగ అందించాలని నిర్ణయించిది. ఈ మేరకు ఏపీలోని 13 జిల్లాలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున అందజేయాలని నిర్ణయించింది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. అయితే, అదే సమయంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రన్న కానుకల సమయంలో నెయ్యి కొనుగోళ్లలో […]
BY sarvi19 April 2016 5:44 AM IST
X
sarvi Updated On: 19 April 2016 6:15 AM IST
చల్లకొచ్చి ముంత దాచడమెందుకు? అంటారు పెద్దలు.. ఏదైనా అడుగుదామని వచ్చి అడగలేకపోతున్న వారిని ఉద్దేశించి అనే మాటలివి. ఎండవేడితో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనాన్ని కలిగించే చర్యల్లో భాగంగా మజ్జిగ అందించాలని నిర్ణయించిది. ఈ మేరకు ఏపీలోని 13 జిల్లాలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున అందజేయాలని నిర్ణయించింది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. అయితే, అదే సమయంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రన్న కానుకల సమయంలో నెయ్యి కొనుగోళ్లలో ఆయన సొంత సంస్థ హెరిటేజ్ కు వాటా దక్కిందని, టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
తాజాగా మజ్జిగ సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మళ్లీ టెండర్లు లేకుండా చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌కే పనులు అప్పజెప్పరన్న గ్యారెంటీ ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈసారి కూడా సొంత సంస్థ విక్రయాలు పెంచుకునేందుకు.. మజ్జిగ రూపంలో వేసిన ఎత్తుగడ అయి ఉంటుందని పలువురు విమర్శిస్తున్నారు. ఏదేమైనా ప్రజా సంక్షేమ పథకాల్లో సొంత కంపెనీలకు స్థానం కల్పిస్తే.. మరోసారి టీడీపీకి విమర్శలు తప్పవని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి, ఈసారైనా టెండర్లు పిలుస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story