Telugu Global
Others

27వ తారీఖున‌ ఏమీ జ‌ర‌గ‌దు: పొంగులేటి

తాను పార్టీ మార‌బోతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లు, ఊహాగానాల‌కు తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి తెర‌దించారు. తాను వైస్సార్ సీపీని వీడేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రెన్ని వార్త‌లు, పుకార్లు ప్ర‌చారం చేసినా తాను మాత్రం పార్టీలోనే కొన‌సాగుతాన‌ని తెలిపారు. ఈనెల 27న ఏదో జ‌రుగ‌బోతోందన్న వార్త‌ల‌ను శ్రీ‌నివాస్‌రెడ్డి కొట్టిపారేశారు. ‘మా పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంది. జిల్లాలో బలం ఉంది. ఇలా తప్పుగా ప్రచారం చేయడం మానుకోవాలి’ అని హితవు పలికారు. తెలంగాణ ఏర్పడ్డాక […]

27వ తారీఖున‌ ఏమీ జ‌ర‌గ‌దు: పొంగులేటి
X

తాను పార్టీ మార‌బోతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లు, ఊహాగానాల‌కు తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి తెర‌దించారు. తాను వైస్సార్ సీపీని వీడేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రెన్ని వార్త‌లు, పుకార్లు ప్ర‌చారం చేసినా తాను మాత్రం పార్టీలోనే కొన‌సాగుతాన‌ని తెలిపారు. ఈనెల 27న ఏదో జ‌రుగ‌బోతోందన్న వార్త‌ల‌ను శ్రీ‌నివాస్‌రెడ్డి కొట్టిపారేశారు. ‘మా పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంది. జిల్లాలో బలం ఉంది. ఇలా తప్పుగా ప్రచారం చేయడం మానుకోవాలి’ అని హితవు పలికారు. తెలంగాణ ఏర్పడ్డాక వైఎస్సార్‌సీపీ మనలేదని ప్రచారం చేసినా..ప్రజల దీవెనలతో ఖమ్మం జిల్లాలో తాను ఎంపీగా గెలిచానని, మూడు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సాసీపీ అభ్యర్థులు విజయం సాధించారని గుర్తు చేశారు. జిల్లా ప్రజల ఆదరణతో 232 గ్రామ పంచాయతీల్లో గెలిచామని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు ఇలా 121 మంది ఉన్నారని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ సత్తా చాటిందని, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలాన్ని నిరూపించుకున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారన్నారు.

అయితే ఈ ప్రచారానికి ఓ కారణం చెప్తున్నారు. ఈ నెల 27 ఖ‌మ్మంలో టీఆర్ ఎస్ ప్లీన‌రీ జ‌ర‌గ‌నుంది. అన్ని జిల్లాల‌తో పోలిస్తే.. ఖమ్మంలో గులాబీ పార్టీ బ‌ల‌హీనంగా ఉంది. అందుకే, ఈ జిల్లాలో పార్టీ ప్లీన‌రీ నిర్వ‌హ‌ణ‌కు సీఎం ప్లాన్ చేశారు. ప‌నిలోప‌నిగా పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఇత‌ర పార్టీల నుంచి భారీగా ప్ర‌జాప్ర‌తినిధులను చేర్చుకునేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. అందుకే, జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కొంద‌రు ఇప్ప‌టికే గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇత‌ర పార్టీల నుంచి గెలిచిన నాయ‌కులను సీఎం కేసీఆర్ స్వ‌యంగా ఆహ్వానిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంటే గులాబీ పార్టీ నిర్ధిష్ట‌మైన హామీలు ఇస్తే త‌ప్ప సీఎం ఆహ్వానించే ప‌రిస్థితి ఉండ‌దు. అందుకే అంతా పొంగ‌లేటి పార్టీ మార‌తారా? లేదా ? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

First Published:  18 April 2016 4:38 AM IST
Next Story