ఒలింపిక్స్ వేదికపై మొట్ట మొదటి భారత మహిళా జిమ్నాస్ట్!
భారత మహిళ మరో ముందడుగు వేసింది. మునుపెన్నడూ లేని విధంగా ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సంపాదించింది. ఈ ఘనతని సాధించిన మొట్టమొదటి భారత యువతి 22ఏళ్ల దీపా కర్మాకర్. బ్రెజిల్, రియో డిజానరోలో జరిగిన క్వాలిఫై ఈవెంట్‌లో దీప అద్భుత ప్రతిభని చూపి అందరినీ ఆశ్చర్యపరచింది. ఈ ఈవెంట్‌లో ఆమె మొత్తం 52.698 పాయింట్లు సాధించింది. దీంతో ఆమె ఆగస్టులో రియోలో జరగనున్న ఒలింపిక్స్‌లో ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో పోటీపడనుంది. దీప ఈ ఘనతని సాధించిన […]
భారత మహిళ మరో ముందడుగు వేసింది. మునుపెన్నడూ లేని విధంగా ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సంపాదించింది. ఈ ఘనతని సాధించిన మొట్టమొదటి భారత యువతి 22ఏళ్ల దీపా కర్మాకర్. బ్రెజిల్, రియో డిజానరోలో జరిగిన క్వాలిఫై ఈవెంట్‌లో దీప అద్భుత ప్రతిభని చూపి అందరినీ ఆశ్చర్యపరచింది. ఈ ఈవెంట్‌లో ఆమె మొత్తం 52.698 పాయింట్లు సాధించింది. దీంతో ఆమె ఆగస్టులో రియోలో జరగనున్న ఒలింపిక్స్‌లో ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో పోటీపడనుంది. దీప ఈ ఘనతని సాధించిన మొదటి భారతీయ మహిళే కాదు, 52 సంవత్సరాల తరువాత ఈ కేటగిరీలో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మొదటి ఇండియన్ కూడా.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక దేశం తరపున ఒలింపిక్స్‌లో పాల్గొన్న జిమ్నాస్ట్‌లు 11 మంది. వీరంతా మగవారే. 1952లో ఇద్దరు, 1956లో ముగ్గురు, 1964లో ఆరుగురు. ఆ తరువాత మనదేశం నుండి ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ కి ఎవరూ వెళ్లలేదు. అలాకూడా దీప దేశకీర్తిని ఇనుమడింపచేసింది. అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య దీప రియో ఒలింపిక్స్‌లో పాల్గొన బోతున్నదన్న సంగతిని ఒక అధికారిక ప్రకటనలో ధృవీకరించింది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న మహిళా ఆర్టిస్టిక్ జిమ్నాస్ట్‌గా వ్యక్తిగత అర్హత సాధించిన వారిలో దీప 79వ స్థానంలో ఉంది. దీప 2014లో గ్లాస్‌గోలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించి, ఈ ఘనతని సాధించిన మొదటి మహిళా జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది.. అలాగే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ పోటీల్లో ఫైనల్స్ వరకు వచ్చిన మొదటి భారతీయ మహిళా జిమ్నాస్ట్ కూడా ఆమే.