జక్కన్నకు నిద్రలేకుండా చేస్తున్న`అవతార్`..!
అవతార్ ఏంటి..రాజమౌళికి నిద్రలేకుండా చేయడం ఏమిటి..? సందేహాం రావోచ్చు . మనకు సందేహామే కానీ.. రాజమౌళికి అయితే సినిమా కనపడుతుంది అంటున్నారు సన్నిహితులు. ఎందుకంటే.. జేమ్స్ కెమరూన్ చిత్రం అంటే ఎలా వుంటుంది. ఒక అద్భుతం లా వుంటుంది. ఆయన అవతార్ ను ఏ రేంజ్ లో చెక్కి థియేటర్స్ కు వదిలారో తెలిసిందే. ఈ విజువల్ ఫీస్ట్ ఎఫెక్ట్ ఇప్పటికి ఆడియన్స్ మదిలో పదిలంగా ఉంది అంటే అతిశయోక్తి కాదు. మరి అటువంటి చిత్రానికి సీక్వెల్ […]
అవతార్ ఏంటి..రాజమౌళికి నిద్రలేకుండా చేయడం ఏమిటి..? సందేహాం రావోచ్చు . మనకు సందేహామే కానీ.. రాజమౌళికి అయితే సినిమా కనపడుతుంది అంటున్నారు సన్నిహితులు. ఎందుకంటే.. జేమ్స్ కెమరూన్ చిత్రం అంటే ఎలా వుంటుంది. ఒక అద్భుతం లా వుంటుంది. ఆయన అవతార్ ను ఏ రేంజ్ లో చెక్కి థియేటర్స్ కు వదిలారో తెలిసిందే. ఈ విజువల్ ఫీస్ట్ ఎఫెక్ట్ ఇప్పటికి ఆడియన్స్ మదిలో పదిలంగా ఉంది అంటే అతిశయోక్తి కాదు. మరి అటువంటి చిత్రానికి సీక్వెల్ వచ్చే యేడాది రిలీజ్ చేస్తున్నారంటే.. ఆ చిత్రం ముందు .. వేరే చిత్రాలు ఎలా నిలబడతాయి..?
అందుకే రాజమౌళికి దడ ప్రారంభం అయ్యింది. బాహుబలి మొదటి భాగం ఘన విజయం సాధించింది. దీంతో సెకండ్ పార్ట్ ను ఒక రేంజ్ లో రూపొందిస్తున్నారు.. అయితే రాజమౌళి తనుకున్న పరిధిలో అద్భుతమైన అవుట్ పుట్ ఇవ్వగలరు. ఈ విషయంలో ఎవరికి సందేహం లేదు. కానీ.. అవతార్ ముందు .. బాహుబలి నిలబడటం అసాధ్యం. ప్రస్తుతం చిన్న పిల్లాడు లీడ్ క్యారెక్టర్ లో చేసిన జంగిల్ బుక్ చిత్రం ముందు మన ఇండియన్ స్టార్ హీరోల చిత్రాలు బాక్సాపీస్ తో పోటి పడలేక పోతున్నాయి. ఇక అవతార్ వంటి సినిమాకు సీక్వెల్ వస్తే.. బాహుబలి కాదు కదా..? ఏ ఇతర చిత్రం కొంత కాలం పాటు పోటీ లో నిలవలేవు అనేది పరిశీలకుల మాట. అవతార్ 2 వచ్చే యేడాది రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డైరెక్ట్ గా డేట్ అయితే ఎనౌన్స్ చేయలేదు కానీ.. వచ్చే యేడాది లో అవతార్ 2 రిలీజ్ అవటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. గుడ్ ఫ్రైడే రోజున అవతార్ 2 ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. రాజమౌళీ కూడా బాహుబలి 2 ను అదేరోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటునట్టు అందరికి తెలిసిన విషయమే. అందుకే రాజమౌళి కి ఒకింత ఆందోళన. మొత్తం మీద అవతార్ రూపంలో రాజమౌళికి మెడ మీద కత్తి ఉన్నట్టే మరి. రాజమౌళి సాధ్యమైనంత త్వరగా బాహుబలి 2 ను పూర్తి చేసి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తారనడంలో సందేహాం లేదు. లేదంటే.. అవతార్2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే.. ఆ చిత్రం విడుదలైన 50 , 60 రోజుల తరువాతనే బాహుబలిని విడుదల చేయడం ఉత్తమం అనేది క్రిటిక్స్ మాట.