పదిలక్షల మందికి 17 మంది న్యాయమూర్తులు!
మనకు న్యాయమూర్తుల కొరత అత్యంత తీవ్రంగా ఉంది. 1987లో లా కమిషన్ తయారుచేసిన ఒక నివేదిక ప్రకారం అప్పుడున్నన్యాయ మూర్తుల సంఖ్య 7,675 అంటే ప్రతి 10 లక్షల మందికి 10.5 మంది న్యాయమూర్తులున్నారు. అది ఇప్పుడు 17కి చేరింది. ఇంకా 5వేల న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కింది కోర్టులకు మంజూరు చేసిన న్యాయమూర్తుల పోస్టులు 20, 214. 24 హైకోర్టులకు కేటాయంచిన న్యాయమూర్తులు 1,056. పెండింగ్ ఉన్న కేసుల సంఖ్య 3.10 కోట్లు. […]
మనకు న్యాయమూర్తుల కొరత అత్యంత తీవ్రంగా ఉంది. 1987లో లా కమిషన్ తయారుచేసిన ఒక నివేదిక ప్రకారం అప్పుడున్నన్యాయ మూర్తుల సంఖ్య 7,675 అంటే ప్రతి 10 లక్షల మందికి 10.5 మంది న్యాయమూర్తులున్నారు. అది ఇప్పుడు 17కి చేరింది. ఇంకా 5వేల న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కింది కోర్టులకు మంజూరు చేసిన న్యాయమూర్తుల పోస్టులు 20, 214. 24 హైకోర్టులకు కేటాయంచిన న్యాయమూర్తులు 1,056. పెండింగ్ ఉన్న కేసుల సంఖ్య 3.10 కోట్లు. సుప్రీంకోర్టుకి 31మంది న్యాయమూర్తుల పోస్టులకు అనుమతి ఉంటే అందులో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టుల న్యాయమూర్తుల పోస్టులు 44శాతం ఖాళీగా ఉన్నాయి. కింది కోర్టుల్లో 23 శాతం పోస్టులు ఖాళీనే.
పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారం కావాలంటే పదిలక్షల మంది ప్రజలకు 50మంది న్యాయమూర్తుల కేటాయింపు ఉండాలని లా ప్యానల్ తన 120వ నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం మనదేశంలో ఈ సంఖ్య 17గా ఉంది. అమెరికాలో ఈ సంఖ్య 107 ఉంది. యుకెలో ఇది 51గా, కెనడాలో 75గా, ఆస్ట్రేలియాలో 42గా ఉంది. 2014 లా కమిషన్ అధ్యయనం ప్రకారం హైకోర్టుకి అదనంగా మరో 56మంది న్యాయమూర్తులు ఉంటే గానీ, ప్రస్తుత న్యాయవ్యవహారాలు సజావుగా సాగవు. ఇక పెడింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారం కావాలంటే అదనంగా మరో 942మంది న్యాయమూర్తుల అవసరం ఉంది.