పార్కు పక్క ఇల్లు...అదో వరాల జల్లు!
పార్కు పక్కనే ఇల్లు ఉంటే ఉదయాలు మార్నింగ్ వాకింగ్ చేసుకోవచ్చు…. సాయంత్రాలు కాసేపు పచ్చని చెట్ల మధ్య కాలక్షేపం చేయవచ్చు, పిల్లలను తీసుకువెళ్లి ఆడించుకోవచ్చు…ఇలాంటి ఉపయోగాలన్నీ మనకు తెలుసు. కానీ మనకు తెలియని ప్రయోజనాలు ఇంకా చాలా ఉన్నాయి. పచ్చని వాతావరణం ఉన్న పరిసరాలకు దగ్గరలో నివసించే వారిలో మానసిక ఆరోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని ఒక నూతన అధ్యయనంలో తేలింది. ఆకుపచ్చదనాన్ని చూడటం వలన ఈ ప్రయోజనం చేకూరుతుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ […]
పార్కు పక్కనే ఇల్లు ఉంటే ఉదయాలు మార్నింగ్ వాకింగ్ చేసుకోవచ్చు…. సాయంత్రాలు కాసేపు పచ్చని చెట్ల మధ్య కాలక్షేపం చేయవచ్చు, పిల్లలను తీసుకువెళ్లి ఆడించుకోవచ్చు…ఇలాంటి ఉపయోగాలన్నీ మనకు తెలుసు. కానీ మనకు తెలియని ప్రయోజనాలు ఇంకా చాలా ఉన్నాయి.
పచ్చని వాతావరణం ఉన్న పరిసరాలకు దగ్గరలో నివసించే వారిలో మానసిక ఆరోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని ఒక నూతన అధ్యయనంలో తేలింది. ఆకుపచ్చదనాన్ని చూడటం వలన ఈ ప్రయోజనం చేకూరుతుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన ఈ అధ్యయనం వెల్లడించింది. లక్షకు పైగా మహిళల జీవన శైలిని ఎనిమిది సంవత్సరాల పాటు గమనించి ఈ విషయాలు తేల్చారు. పచ్చదనానికి దగ్గరగా ఉన్న మహిళలు, అలాంటి వాతావరణంలో లేనివారికంటే 34 శాతం తక్కువగా శ్వాస సంబంధిత బాధలకు గురవుతున్నట్టుగా, అలాగే పచ్చదనంకి చేరువగా ఉన్న మహిళలకు క్యాన్సర్‌తో మరణించే ప్రమాదం మిగిలిన వారికంటే 13 శాతం తగ్గుతున్నట్టుగా అధ్యయననిర్వాహకులు గుర్తించారు. మొత్తం మీద పచ్చదనానికి దగ్గరగా ఉంటే మరణానికి దూరంగా ఉండే వరం దక్కడం ఆశ్చర్యకరంగా ఉందని ఈ అధ్యయనంలో పాల్గొన్న పీటర్ జేమ్స్ అనే శాస్త్రవేత్త అంటున్నారు. ఎంత ఎక్కువగా పచ్చని చెట్లను చూస్తే అంత ఎక్కువగా మానసికారోగ్యం పెరుగుతున్నట్టుగా అధ్యయనంలో గమనించారు. పచ్చదనానికి దగ్గరగా నివసించేవారిలో డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి ఇతరుల్లో కంటే తక్కువగా ఉండటం అధ్యయనం బృందం చూసింది. మొత్తానికి ప్రకృతికి, మనిషికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ అధ్యయనం మరొకసారి రుజువుచేసింది.