నచ్చిన నెంబర్లకు ...ఫ్యాన్సీ రేట్లు!
వాహనదారులకు ఉన్న అదృష్ట సంఖ్యల నమ్మకం కర్ణాటక రవాణా శాఖకు కాసులు కురిపిస్తోంది. ఎక్కువమంది వాహనదారులు ఆశిస్తున్న నెంబర్లను రవాణా శాఖ శుక్రవారం వేలం వేసింది. ఇందులో ఒక వ్యాపారవేత్త కెఎ 51 ఎమ్‌కె 1 అనే నెంబరుని అత్యధికంగా రూ. 7.75 లక్షలకు సొంతం చేసుకున్నాడు. సాధారణంగా తొమ్మిది నెంబరు కోసం ఎక్కువమొత్తం ఖర్చుపెడుతుంటారు. అయితే ఈ నెంబరులో తొమ్మిది లేకపోవడం గమనించవచ్చు. గత మూడు వేలం పాటల్లో 9 ఉన్న నెంబర్లు ఎక్కువ ధర […]
వాహనదారులకు ఉన్న అదృష్ట సంఖ్యల నమ్మకం కర్ణాటక రవాణా శాఖకు కాసులు కురిపిస్తోంది. ఎక్కువమంది వాహనదారులు ఆశిస్తున్న నెంబర్లను రవాణా శాఖ శుక్రవారం వేలం వేసింది. ఇందులో ఒక వ్యాపారవేత్త కెఎ 51 ఎమ్‌కె 1 అనే నెంబరుని అత్యధికంగా రూ. 7.75 లక్షలకు సొంతం చేసుకున్నాడు. సాధారణంగా తొమ్మిది నెంబరు కోసం ఎక్కువమొత్తం ఖర్చుపెడుతుంటారు. అయితే ఈ నెంబరులో తొమ్మిది లేకపోవడం గమనించవచ్చు. గత మూడు వేలం పాటల్లో 9 ఉన్న నెంబర్లు ఎక్కువ ధర పలికాయి. క్రితం నెలలో కెఎ 53 ఎమ్ఇ 999 నెంబరు మూడులక్షలకు, కెఎ 53 ఎమ్ఇ 1 (మొత్తం కలిపితే తొమ్మిది) నెంబరు 2.10 లక్షలకు అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు ఈ నెంబర్ల వేలం ద్వారా కర్ణాటక రవాణా శాఖకు 18.34 కోట్ల రూపాయలు సమకూరాయి. శుక్రవారం ఒక్కరోజు నెంబర్ల వేలం ద్వారా 21.25లక్షల రూపాయలు వసూలు అయ్యాయి. నెంబర్ల కోసం పోటీపడుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో గతసంవత్సరం జూన్ నుండి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.