ఢిల్లీలో నమిలే పొగాకు ఉత్పత్తులపై నిషేధం!
గుట్కా, పాన్‌మసాలా, జర్దా తదితర అన్నిరకాల నమిలే పొగాకు ఉత్పత్తులపై ఢిల్లీ ప్రభుత్వం సంవత్సరం పాటు నిషేధం విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం 2012లోనే గుట్కాని నిషేధిస్తూ ఒక నోటిఫికేషన్‌ని జారీ చేసింది. అయితే దాని పరిధిలోకి రాకుండా పొగాకుని విక్రయించే క్రమంలో ఉత్పత్తి దారులు పొగాకుని పలురూపాల్లో, భిన్న పాకెట్లలో అమ్ముతున్నారు. పొగాకు ఉత్పత్తులే అయినా వాటికి రకరకాల పేర్లను పెట్టి అమ్ముతుండటంతో నమిలే పొగాకుకి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులను నిషేధిస్తూ […]
గుట్కా, పాన్‌మసాలా, జర్దా తదితర అన్నిరకాల నమిలే పొగాకు ఉత్పత్తులపై ఢిల్లీ ప్రభుత్వం సంవత్సరం పాటు నిషేధం విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం 2012లోనే గుట్కాని నిషేధిస్తూ ఒక నోటిఫికేషన్‌ని జారీ చేసింది. అయితే దాని పరిధిలోకి రాకుండా పొగాకుని విక్రయించే క్రమంలో ఉత్పత్తి దారులు పొగాకుని పలురూపాల్లో, భిన్న పాకెట్లలో అమ్ముతున్నారు. పొగాకు ఉత్పత్తులే అయినా వాటికి రకరకాల పేర్లను పెట్టి అమ్ముతుండటంతో నమిలే పొగాకుకి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులను నిషేధిస్తూ ప్రభుత్వం ఇప్పుడు ఈ కొత్త నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. ఆహార భద్రతా విభాగం అధికారులు ఈ నోటిఫికేషన్‌ని విడుదల చేశారు. దీని ప్రకారం నమిలే పొగాకు ఉత్పత్తులను కొన్నా, అమ్మినా, నిల్వ ఉంచినా నేరమవుతుంది. పొగాకుని, ఇతర తినే పదార్థాలతో కలిపి కొత్త పదార్థాలుగా తయారుచేసినా, వాసనకోసం జోడించినా, నేరుగా కాకుండా పాన్‌మసాలా లాంటి భిన్న ఉత్పత్తుల రూపంలో తయారుచేసినా గానీ నేరమే అవుతుంది.