జానారెడ్డి ఫిర్యాదుతో ఎవరికి లాభం?
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను గులాబీ పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతున్నారు. నైతికత ఉంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని రాజీనామా చేయించి, తిరిగి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. దీనిపై ఊరుకునేది లేదని, ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ప్రతిపక్షాల ఉనికికే ప్రమాదమని జానారెడ్డి భావిస్తున్నారు. ఈ విషయమై ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నారు. అయితే, ప్రధానికి […]
BY admin15 April 2016 7:16 AM IST
X
admin Updated On: 15 April 2016 7:16 AM IST
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను గులాబీ పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతున్నారు. నైతికత ఉంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని రాజీనామా చేయించి, తిరిగి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. దీనిపై ఊరుకునేది లేదని, ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ప్రతిపక్షాల ఉనికికే ప్రమాదమని జానారెడ్డి భావిస్తున్నారు. ఈ విషయమై ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నారు. అయితే, ప్రధానికి ఫిర్యాదు చేస్తే.. ఈ విషయంపై ఆయన వెంటనే చర్యలు తీసుకుంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.
మరి ఏపీ సంగతేంటి?
ఏపీలోనూ పార్టీ ఫిరాయింపులు జోరుగానే సాగుతున్నాయి. అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆశజూపి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏలో టీడీపీ భాగస్వామి మరి అలాంటప్పుడు తెలంగాణపై జోక్యం చేసుకునేముందు ఏపీ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంటుంది. మరి బీజేపీ అంత సాహసం చేస్తుందా? పైగా ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను నయానో..భయానో.. తన వైపు తిప్పుకుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టేందుకు కుట్రలు చేస్తోందని బీజేపీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లే ఇందుకు నిదర్శనమని విమర్శిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం మేమెవరినీ ప్రలోభాలకు గురిచేయడం లేదని వాదిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు బీజేపీ పాలిత రాష్ర్టాలను తన ఖాతాలో వేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేసిందని గుర్తు చేస్తున్నారు! సో.. పార్టీ ఫిరాయింపులనేవి.. ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి అధికార పక్షం చేతిలో ఉన్న తక్షణాయుధాలు. వీటిపై కోర్టులు కూడా ఏం చేయలేవనే ధీమానే ఇందుకు కారణం. కాబట్టి, జానారెడ్డి ఫిర్యాదు చేయగానే.. ఇప్పటికిప్పుడు జరిగేదేమీ ఉండదు.
Next Story