పోలీస్ స్టేషన్ చుట్టూ పూరి ప్రదక్షిణలు
క్రైం సినిమాల్ని కూడా తనదైన శైలిలో తీయడం పూరి జగన్నాధ్ స్టయిల్. రామ్ గోపాల్ వర్మ సినిమాల్ని రియలిస్టిక్ గా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తుంటే… అతడి శిష్యుడు పూరి మాత్రం సన్నివేశాలకు సినిమాటిక్ టచ్ ఇస్తుంటాడు. హీరోయిజంతో పాటు కాస్త మసాలా యాడ్ చేస్తుంటాడు. కానీ ఈ సారి మాత్రం పూరి జగన్నాధ్, కాస్త సహజంగా ఉండేలా సన్నివేశాలు తీయాలనుకుంటున్నాడు. అందుకోసం ఏకంగా పోలీస్ స్టేషన్ కే వెళ్లాడు.బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పూరి, అసిస్టెంట్ కమిషనర్ […]
BY sarvi15 April 2016 6:53 AM IST

X
sarvi Updated On: 15 April 2016 7:29 AM IST
క్రైం సినిమాల్ని కూడా తనదైన శైలిలో తీయడం పూరి జగన్నాధ్ స్టయిల్. రామ్ గోపాల్ వర్మ సినిమాల్ని రియలిస్టిక్ గా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తుంటే… అతడి శిష్యుడు పూరి మాత్రం సన్నివేశాలకు సినిమాటిక్ టచ్ ఇస్తుంటాడు. హీరోయిజంతో పాటు కాస్త మసాలా యాడ్ చేస్తుంటాడు. కానీ ఈ సారి మాత్రం పూరి జగన్నాధ్, కాస్త సహజంగా ఉండేలా సన్నివేశాలు తీయాలనుకుంటున్నాడు. అందుకోసం ఏకంగా పోలీస్ స్టేషన్ కే వెళ్లాడు.బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పూరి, అసిస్టెంట్ కమిషనర్ ఉదయ్ కుమార్ రెడ్డిని కలిశాడు. కమిషనర్ తనకు స్నేహితుడు కూడా కావడంతో దాదాపు గంట పాటు ఇద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. ఈ అనుభవాన్నంతా తన నెక్ట్స్ సినిమాలో చూపించడానికి పూరి జగన్నాధ్ సిద్ధమౌతున్నాడు. త్వరలోనే మహేష్ బాబుతో పూరి జగన్నాధ్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని అంతా అంటున్నారు. ఆ సినిమాలో సన్నివేశాల కోసమే పూరి జగన్నాధ్ ఇలా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడని సమాచారం. దీనిపై పూరి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
Next Story