దుమ్ముదులుపుతున్న నాగార్జున
ఈమధ్య నాగార్జున ఏం చేసినా అది సక్సెస్ అవుతోంది. సోగ్గాడే సినిమా తర్వాత ఊపిరితో వరుసగా మరో విజయాన్ని అందుకున్నాడు కింగ్. ఇప్పుడీ సినిమా మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. ఏకంగా వంద కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యేందుకు ఊపిరి దూసుకుపోతోంది. అన్ని ఏరియాల్లో మాంచి వసూళ్లు సాధించిన ఊపిరి మూవీ ఓవర్ సీస్ లో అదరగొట్టింది. నాగ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ కలెక్షన్లు వచ్చిన మూవీగా రికార్డు సృష్టించిన ఊపిరి…. ఇప్పటివరకూ 80 కోట్ల వరకూ […]
BY sarvi15 April 2016 6:45 AM IST
X
sarvi Updated On: 15 April 2016 7:18 AM IST
ఈమధ్య నాగార్జున ఏం చేసినా అది సక్సెస్ అవుతోంది. సోగ్గాడే సినిమా తర్వాత ఊపిరితో వరుసగా మరో విజయాన్ని అందుకున్నాడు కింగ్. ఇప్పుడీ సినిమా మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. ఏకంగా వంద కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యేందుకు ఊపిరి దూసుకుపోతోంది. అన్ని ఏరియాల్లో మాంచి వసూళ్లు సాధించిన ఊపిరి మూవీ ఓవర్ సీస్ లో అదరగొట్టింది. నాగ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ కలెక్షన్లు వచ్చిన మూవీగా రికార్డు సృష్టించిన ఊపిరి…. ఇప్పటివరకూ 80 కోట్ల వరకూ కలెక్ట్ చేసిందని సమాచారం. పవన్ నటించిన సర్దార్ ఫ్లాప్ అవ్వడం, వేసవి సెలవులు కూడా కావడంతో…. మరో 20కోట్లు సంపాదించడం ఈ సినిమాకు ఏమంత కష్టం కాదని ట్రేడ్ పండిట్స్ విశ్లేషిస్తున్నారు. మరోవైపు శాటిలైట్ రైట్స్ లో ఊపిరి రికార్డు సృష్టిస్తోంది. ఏకంగా 14 కోట్ల రూపాయలకు సన్ నెట్ వర్క్ ఈ సినిమా రైట్స్ కొల్లగొట్టినట్టు చెబుతున్నారు. అయితే తెలుగు-తమిళ భాషలతో కలిపి ఈ రేటు పలికింది. ఊపిరి సినిమా తమిళనాట కూడా హిట్టయితే… ఓవరాల్ వసూళ్లు మరో రకంగా ఉండేవి.
Next Story