ఆస్తులు రాయించుకున్న ఎంపీ… విడిపించిన జగన్
ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలక ప్రజాప్రతినిధి దెబ్బకు సొంతపార్టీ వారే వణికిపోతున్నారు. ఏమాత్రం దయాదక్షిణ్యాలు లేకుండా ఆయన సొంత పార్టీ నేతల పట్ల వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. ఇటీవల మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఉదంతమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. జంకె వెంకటరెడ్డి పెద్దగా డబ్బున్న వారు కాదు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన జగన్… ఎలక్షన్ ఖర్చుల కోసం కొద్దిమేర ఆర్థిక సాయం కూడా చేశారు. అయినప్పటికీ తన వంతు ప్రయత్నంగా మరికొంత […]
ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలక ప్రజాప్రతినిధి దెబ్బకు సొంతపార్టీ వారే వణికిపోతున్నారు. ఏమాత్రం దయాదక్షిణ్యాలు లేకుండా ఆయన సొంత పార్టీ నేతల పట్ల వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. ఇటీవల మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఉదంతమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. జంకె వెంకటరెడ్డి పెద్దగా డబ్బున్న వారు కాదు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన జగన్… ఎలక్షన్ ఖర్చుల కోసం కొద్దిమేర ఆర్థిక సాయం కూడా చేశారు. అయినప్పటికీ తన వంతు ప్రయత్నంగా మరికొంత మొత్తాన్ని వెంకటరెడ్డి అప్పు చేశారు. మొత్తానికి వెంకటరెడ్డి ఎన్నికల్లో గెలిచారు. కానీ…
ఆ తర్వాతే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధి, జగన్‌కు బంధువు, పార్టీ వ్యవహారాల్లో చక్రం తిప్పే నేత ఒకరు వెంకటరెడ్డి వెంటపడ్డారు. ఎన్నికల సమయంలో తను హామీదారుగా ఉండి అప్పుఇప్పించడంతో దాన్ని తిరిగి చెల్లించాలని విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. కొద్దిగా సమయం అడిగినా సదరు కీలక నేత ఒప్పుకోలేదట. దీంతో గత్యంతరం లేక చివరకు తన పొలాన్ని సదరు చక్రం తిప్పే నేతకే రాసి ఇచ్చారు వెంకటరెడ్డి. అయితే ఈ విషయాన్ని కొందరు జగన్ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో సదరు కీలక నేతపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఇటీవల సదరు కీలక నేతకు, జగన్‌కు మధ్య విభేదాలు కూడా వచ్చాయని చెబుతుంటారు. కారణం వెంకటరెడ్డి పొలాన్ని రాయించుకోవడమేనని చెబుతున్నారు.
వెంకటరెడ్డికి ఎదురైన అనుభవాన్ని తెలుసుకున్న జగన్… విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి, కొడాలినానిని రంగంలోకి దింపారట. ఎమ్మెల్యే వెంకటరెడ్డిని కలిసిన చెవిరెడ్డి, నానిలు ధైర్యం చెప్పి పొలం వెనక్కు ఇప్పించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారట. అనుకున్నట్టుగానే కొద్దిరోజుల క్రితం పొలానికి సంబంధించిన పత్రాలను తిరిగి వెంకటరెడ్డికి జగన్ ఇప్పించారట. జంకె వెంకటరెడ్డి పరిస్థితి జగన్‌కు తెలిసింది కాబట్టి సరిపోయింది. కానీ సదరు కీలక నేత వల్ల చాలా మంది పార్టీలో ఇబ్బందిపడుతున్నారని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ దెబ్బతినడానికి కూడా సదరు నేత సలహాలు కూడా కారణమని చెప్పుకుంటున్నారు. ఆరు నెలల కిందటి వరకు జిల్లా పార్టీ ఆఫీసు అద్దెను వైవీ సుబ్బారెడ్డి చెల్లించేవారట. ఆ తర్వాత నుంచి అద్దె ఇవ్వడం మానేశారు. దీంతో ఇప్పుడు ఆ భారాన్ని బాలినేని శ్రీనివాస్ రెడ్డి మోస్తున్నారట.
Click on Image to Read: