అవును...నేను ప్రత్యూషని కొట్టాను!
టివి నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో రాహుల్ రాజ్ మాజీ ప్రేయసిగా ప్రచారంలోకి వచ్చిన సలోని శర్మ, ఈ ఉదంతంపై నోరు తెరిచి అనేక విషయాలు వెల్లడించింది. తాను ప్రత్యూషని కొట్టడం నిజమేనని ఒప్పుకున్న ఆమె, వారిద్దరూ కలసి తనని కొట్టిన తరువాతే తానామెని కొట్టినట్టుగా తెలిపింది. ప్రత్యూష గత పదినెలలుగా మాత్రమే రాహుల్‌కి తెలుసునని, కానీ రాహుల్‌తో తనకున్న అనుబంధం ఐదేళ్ల నాటిదని చెప్పింది. ఆమె చెబుతున్న వివరాల ప్రకారం….సలోని తన చదువు పూర్తయిన తరువాత […]
టివి నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో రాహుల్ రాజ్ మాజీ ప్రేయసిగా ప్రచారంలోకి వచ్చిన సలోని శర్మ, ఈ ఉదంతంపై నోరు తెరిచి అనేక విషయాలు వెల్లడించింది. తాను ప్రత్యూషని కొట్టడం నిజమేనని ఒప్పుకున్న ఆమె, వారిద్దరూ కలసి తనని కొట్టిన తరువాతే తానామెని కొట్టినట్టుగా తెలిపింది. ప్రత్యూష గత పదినెలలుగా మాత్రమే రాహుల్‌కి తెలుసునని, కానీ రాహుల్‌తో తనకున్న అనుబంధం ఐదేళ్ల నాటిదని చెప్పింది. ఆమె చెబుతున్న వివరాల ప్రకారం….సలోని తన చదువు పూర్తయిన తరువాత కోల్‌కతా నుండి ముంబయికి వచ్చింది. మోడల్‌గా, టివి నటిగా అవకాశాలు వస్తున్న తరుణంలో రాహుల్ రాజ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పటికే అతనికి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఉంది. తరువాత ఇద్దరూ కలిపి మరో కంపెనీని స్థాపించారు. వ్యాపారంతో పాటు జీవితాలూ పంచుకున్నారు.
కొత్త కంపెనీలో సలోనీ 30 లక్షల వరకు తన డబ్బుని పెట్టింది. అయితే ఈ క్రమంలో రాహుల్‌కి ప్రత్యూష పరిచయం అయ్యింది. ప్రత్యూషతో రాహుల్‌కున్న అనుబంధం గురించి కామన్ ఫ్రెండ్ప్ ద్వారా తెలుసుకున్న సలోని ఆశ్చర్యపోయింది. ఆ విషయం అడిగేందుకు అతని ఫ్లాట్‌కి వెళితే అప్పుడే అక్కడకు వచ్చిన ప్రత్యూష, రాహుల్‌ని, కంపెనీని వదిలేసి పొమ్మని బెదిరించింది. ఏం జరుగుతుందో తెలియని సలోని గందరగోళంలో పడింది. అయితే తెల్లారి రాహుల్ క్షమాపణ చెబుతూ అదేంలేదు…అదంతా మర్చిపో అని సముదాయించాడు. దాంతో ఆమె ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. సలోని, వారిద్దరి మధ్యా ఏ రిలేషన్ లేదని అనుకుంటుండగానే ప్రత్యూష, రాహుల్ తాము పెళ్లి చేసుకుంటున్నట్టుగా ప్రకటించారు. దాంతో ఆశ్చర్యపోయిన సలోని, రాహుల్‌ని కలిసి ఈ విషయం గురించి అడగ్గా, అతను సమాధానం చెప్పకపోగా, సలోని తండ్రికి ఫోన్ చేసి మీ అమ్మాయిని తీసుకుపొమ్మని చెప్పాడు. అప్పుడు ప్రత్యూషతో పాటు ఆమె తల్లి దండ్రులు కూడా అక్కడ ఉన్నారు. సలోని తండ్రి వారితో, తమకు రాహుల్ నుండి రావాలసిన డబ్బు గురించి చెప్పాడు…అంతేకాదు, ఇప్పుడు మా అమ్మాయికి పట్టిన గతే రేపు మీ అమ్మాయికీ పడుతుందని వారిని హెచ్చరించాడు….ఇవన్నీ సలోని వెల్లడించిన వివరాలు.
తన డబ్బుని తిరిగి ఇవ్వమని అడగడానికి వెళితేనే ప్రత్యూష, రాహుల్ రాజ్ తనని కొట్టారని, దాంతో తాను తిరిగి ప్రత్యూషపై చేయిచేసుకున్నానని ఆమె పేర్కొంది. బంగూర్ నగర్ పోలీస్ స్టేషన్లో వారిద్దరిమీద కేసు పెట్టానని, తరువాత వారిద్దరు తనని కేసు వాపసు తీసుకోమని కోరారని, పోలీసులు కూడా వృథాగా నలుగురి నోళ్లలో నానటం ఎందుకని సలహా ఇవ్వడంతో కేసుని ఉపసంహరించుకున్నానని తెలిపింది. అప్పుడు తనకు సలహా ఇచ్చిన ఆ పోలీసులే ఇప్పుడు ప్రత్యూష కేసుని విచారిస్తున్నారని సలోని చెప్పింది.
తనకు సంబంధంలేని విషయం గురించి తాను బయటకు రావడం ఇష్టంలేకే ఇంతకాలం నోరు విప్పలేదని ఆమె అంది. తమ ముగ్గురి జీవితాల్లో ఏం జరిగిందో తెలియనివారంతా తన గురించి చాలా మాట్లాడారని, అందుకే తానిప్పుడు మాట్లాడాల్సి వస్తోందని సలోని వెల్లడించింది. నిజానికి ప్రత్యూష మరణించిన తెల్లారే తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెప్పాల్సింది చెప్పానని, ఇంకా అవసరం ఉంటే వారికి సహకరిస్తానని కూడా చెప్పానని సలోని తెలిపింది.
ఇప్పుడు తాను పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయానని, తమ మధ్య బంధం తిరిగి కొనసాగే అవకాశం లేదని, అయితే రాహుల్ నుండి తాను డబ్బుని తిరిగి వసూలు చేసుకుంటానని ఆమె తెలిపింది. ఈ మొత్తం చేదు సంఘటనలను తన జీవితం నుండి తుడిచేయాలనుకుంటున్నానని, తనపై ఆరోపణలు చేసినవారి మీద పరువు నష్టం దావా వేస్తానని కూడా సలోని శర్మ వెల్లడించింది.