ఓ యాప్...ఆపదని ఆపుతుంది!
మహిళల రక్షణ కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఏవోఒక కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా టెక్నాలజీని వాడుకుని వేగంగా స్పందించే అవకాశాన్ని వారు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో షి టీమ్స్ ప్రతిభావంతంగా పనిచేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ పోలీసులు కాలేజి విద్యార్థులతో పవర్ ఏంజిల్స్ అనే బృందాలను తయారుచేసి మహిళా రక్షణ విషయంలో నిఘా వర్గాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో ఓ సరికొత్త యాప్‌ని పోలీసులు ప్రవేశపెట్టారు. ముంబయి పోలీసుల ఆధ్వర్యంలో […]
మహిళల రక్షణ కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఏవోఒక కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా టెక్నాలజీని వాడుకుని వేగంగా స్పందించే అవకాశాన్ని వారు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో షి టీమ్స్ ప్రతిభావంతంగా పనిచేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ పోలీసులు కాలేజి విద్యార్థులతో పవర్ ఏంజిల్స్ అనే బృందాలను తయారుచేసి మహిళా రక్షణ విషయంలో నిఘా వర్గాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో ఓ సరికొత్త యాప్‌ని పోలీసులు ప్రవేశపెట్టారు. ముంబయి పోలీసుల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ యాప్‌తో ఆపదలో ఉన్న మహిళల చెంతకు పోలీసులు అత్యంత వేగంగా వెళ్లే వీలు కలుగుతుంది. దీనిపేరు ప్రతిసాద్. దీని ద్వారా ఆపదలో,ఇబ్బందుల్లో ఉన్న మహిళల వద్దకు పోలీసులు కేవలం ఏడునిముషాల్లో చేరుకుంటారు. ఇప్పటికే మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమల్లోకి తెచ్చారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.
దీన్ని ఉపయోగించుకునే విధానం కూడా చాలా సులువు. ఫోన్లో ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని జీపీఎస్ సిస్టమ్‌ని ఆన్‌లో ఉంచాలి. పోలీసుల అవసరం ఉన్న అత్యవసర సమయంలో మహిళలు ఈ యాప్‌లోని ఎమర్జన్సీ ఐకాన్‌ని క్లిక్ చేయాలి. అంతే…ఆయా మహిళలు ఉన్న ప్రాంతాలకు చేరువలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి ఆ అత్యవసర సందేశం చేరుతుంది. పోలీస్ కంట్రోల్ రూంకి సైతం అందుతుంది. అంతేకాదు, పోలీస్ స్టేషన్‌నుండి త్వరగా ఘటనా స్థలానికి చేరాలంటే ఎలా వెళ్లాలో తెలిపే రూట్‌మ్యాప్‌ని కూడా యాప్ చూపుతుంది. దీంతో కేవలం ఏడునిముషాల వ్యవథిలో ఘటనా స్థలానికి చేరవచ్చని పోలీసులు భావిస్తున్నారు.