ఏపీ ప్రభుత్వంపై సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సర్వే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో చంద్రబాబు ప్రభుత్వానికి షాక్ ఇచ్చే పలు అంశాలు తేలాయి. చంద్రబాబు పాలనపై జనంలో అసంతృప్తి చెలరేగుతోందని సర్వే వెల్లడించింది. చంద్రబాబుపై యువత తీవ్ర నిరాశతో ఉన్నట్టు గుర్తించింది. చంద్రబాబు రోజురోజుకు ప్రజల మద్దతు కోల్పోతున్నారని సర్వే తేల్చింది. ఏపీలో అవినీతి తారా స్థాయిలో ఉన్నట్టు నిర్దారించింది. అవినీతి నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, రెవెన్యూ శాఖ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినట్టు […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో చంద్రబాబు ప్రభుత్వానికి షాక్ ఇచ్చే పలు అంశాలు తేలాయి. చంద్రబాబు పాలనపై జనంలో అసంతృప్తి చెలరేగుతోందని సర్వే వెల్లడించింది. చంద్రబాబుపై యువత తీవ్ర నిరాశతో ఉన్నట్టు గుర్తించింది.
చంద్రబాబు రోజురోజుకు ప్రజల మద్దతు కోల్పోతున్నారని సర్వే తేల్చింది. ఏపీలో అవినీతి తారా స్థాయిలో ఉన్నట్టు నిర్దారించింది. అవినీతి నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, రెవెన్యూ శాఖ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినట్టు సర్వేలో తేలింది. విద్య, వైద్యారోగ్య శాఖల్లోనూ అవినీతి తీవ్రస్థాయిలో ఉన్నట్టు గుర్తించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చంద్రబాబు సమదృష్టితో అభివృధ్ధి చేయడం లేదని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సర్వేలో తేలింది. చంద్రబాబు పదేపదే అమరావతి గురించి గొప్పగా చెబుతున్నా జనం మాత్రం దాని గురించి పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది. ఏపీలో ప్రాథమిక విద్య చాలా ఖరీదైపోయిందని… ప్రైవేట్ స్కూళ్లను రాజకీయనాయకులే ప్రోత్సహిస్తున్నారని సర్వే రిపోర్ట్ వెల్లడించింది.
చంద్రబాబు గ్రాఫ్ నానాటికి పడిపోతున్నట్టు సర్వే తేల్చింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో పాలన బాగానే ఉన్నట్టు ఈ సర్వే తేల్చింది. రుణమాఫీ విషయంలో ప్రభుత్వంపై రైతుల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్ భాస్కరరావు చెప్పారు. గత నెలలో ఈ సర్వే చేశారు. చంద్రబాబు చెప్పేదానికి చేసేదానికి పొంతున లేదని తేలిందన్నారు.
Click on Image to Read: