బొబ్బిలి బ్రదర్స్‌కి రెండు పదవులట!
విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు పార్టీ వీడడం ఖాయమైపోయింది. ఈ విషయాన్ని సాక్షి దినపత్రిక కూడా ధృవీకరించడం విశేషం. అంతేకాదు సుజయ్ కృష్ణను కూడా టీడీపీ ప్రలోభాలు పెట్టి తీసుకెళ్తోందని సాక్షి కథనం.సుజయ్‌కు మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసిందని వెల్లడించింది. ఈ విషయాన్ని తన అనుచరులతో సుజయ్ కృష్ణ స్వయంగా వెల్లడించారట. టీడీపీలోనూ కీలక బాధ్యతలు ఇచ్చేందుకు టీడీపీ అధినాయకత్వం అంగీకరించిందని కథనం. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారడం అనివార్యమని ఆయన […]
విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు పార్టీ వీడడం ఖాయమైపోయింది. ఈ విషయాన్ని సాక్షి దినపత్రిక కూడా ధృవీకరించడం విశేషం. అంతేకాదు సుజయ్ కృష్ణను కూడా టీడీపీ ప్రలోభాలు పెట్టి తీసుకెళ్తోందని సాక్షి కథనం.సుజయ్‌కు మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసిందని వెల్లడించింది. ఈ విషయాన్ని తన అనుచరులతో సుజయ్ కృష్ణ స్వయంగా వెల్లడించారట. టీడీపీలోనూ కీలక బాధ్యతలు ఇచ్చేందుకు టీడీపీ అధినాయకత్వం అంగీకరించిందని కథనం. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారడం అనివార్యమని ఆయన వ్యాఖ్యానించారట.
సుజయ్ కృష్ణ రంగారావు బొబ్బిలి కోటలో బుధవారం రాత్రి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. తమను నమ్ముకున్న ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, వారికి న్యాయం జరగాలంటే అధికార పార్టీ వైపు వెళ్లక తప్పడంలేదని చెప్పినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతలతో తాను మాట్లాడానని జిల్లా అధ్యక్ష పగ్గాలు కూడా అప్పగించేందుకు టీడీపీ నాయకత్వం ఒప్పుకుందని ఆయన చెప్పినట్టు సమాచారం.
పెద్దమనుషులుగా పేరున్న బొబ్బిలి రాజావారు కూడా టీడీపీ ప్రలోభాలకు తలొగ్గారా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. అయితే టీడీపీ ప్రలోభాల కన్నా… వైసీపీలోకి బొత్ససత్యనారాయణ రాక వల్లే సుజయ్ కృష్ణ రంగరావు సోదరులు పార్టీ వీడుతున్నట్టుగా చాలా మంది భావిస్తున్నారు. బొబ్బిలి ఎమ్మెల్యేగా సుజయ్ కృష్ణ రంగారావు మూడుసార్లు గెలుపొందారు. తొలి రెండు విడతలు ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే బొత్స కారణంగానే నియోజకవర్గాన్ని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయామని సుజయ్ సోదరుల భావన. ఈనెల 15న సుజయ్ సోదరులు టీడీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించినట్టు సమాచారం.
Click on Image to Read: