జమ్ము కశ్మీర్‌లో పోలీసు కాల్పుల్లో ముగ్గురి మృతి!
జమ్ము కశ్మీర్‌లోని హంద్వారాలో ప్రాంతంలో భద్రతా దళ సిబ్బంది జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు మరణించారు. ఒక కాలేజి విద్యార్థినిపై ఓ ఆర్మీ జవాను అత్యాచారం చేసిన ఘటన బయటకు పొక్కడంతో ఆ చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు దిగారు. దాంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళ పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు వ్యక్తులు మరణించినట్టుగా తెలుస్తోంది. వీరిలో ఒక జూనియర్ క్రికెటర్ ఉన్నాడని సమాచారం. అత్యాచార విషయం బయటపడగానే స్థానికంగా ఉన్న జనం పెద్ద ఎత్తున గుమిగూడి […]
జమ్ము కశ్మీర్‌లోని హంద్వారాలో ప్రాంతంలో భద్రతా దళ సిబ్బంది జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు మరణించారు. ఒక కాలేజి విద్యార్థినిపై ఓ ఆర్మీ జవాను అత్యాచారం చేసిన ఘటన బయటకు పొక్కడంతో ఆ చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు దిగారు. దాంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళ పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు వ్యక్తులు మరణించినట్టుగా తెలుస్తోంది. వీరిలో ఒక జూనియర్ క్రికెటర్ ఉన్నాడని సమాచారం. అత్యాచార విషయం బయటపడగానే స్థానికంగా ఉన్న జనం పెద్ద ఎత్తున గుమిగూడి ఆర్మీ బంకర్ ని పేల్చేయడానికి ప్రయత్నించగా అక్కడ కాపాలా ఉన్న భద్రతా సిబ్బంది కాల్పులు జరిపినట్టుగా పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
21 రాష్ట్రీయ రైఫిల్స్ కి చెందిన ఆ జవానుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పినా ఆందోళన కారులు వినలేదని అందుకే కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అయితే నిందితుడి పేరుని వెల్లడించాలని, అతడిని అరెస్టు చేయాలని జనం డిమాండ్ చేసినట్టుగా ప్రత్యక్షసాక్షులు చెప్పారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన ముగ్గురిలో ఇద్దరిని మహమ్మద్ ఇక్బాల్, నయీమ్ ఖాదిర్ భట్‌గా గుర్తించారు. వీరిద్దరు సుమారు 20 సంవత్సరాలు, ఆపైన వయసున్నవారే. ఆర్మీ అధికారులు, నిందితుడికి శిక్షపడేలా చూస్తామని, ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. పబ్లిక్ టాయ్‌లెట్‌కి వెళ్లిన విద్యార్థినిపై జవాను అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది.