ఆందోళనబాటలో సర్దార్ బయ్యర్లు
పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఊహించిన మేర విజయవంతం కాకపోవడంతో డిస్టిబ్యూటర్లు, బయ్యర్లు లబోదిబోమంటున్నారు. ఆస్తులు తాకట్టుపెట్టి సినిమా కొన్నవారు ఇప్పుడు ఆందోళనకు సిద్ధమవుతున్నారని ఒక ప్రముఖ పత్రిక కథనం. తొలిరోజు సినిమా టాక్ న్యూట్రల్‌గా ఉన్నా రెండో రోజు నుంచి ఏకపక్షంగా నెగిటివ్ టాక్ నడించింది. రాజకీయంగా పవన్‌ను దెబ్బకొట్టడానికి కొన్ని రాజకీయ శక్తులు పనిగట్టుకుని ఈ ప్రచారం చేశాయన్న ఆరోపణలు ఉన్నాయి. నెగిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు భారీగా కుప్పకూలిపోయాయి. వీకెండ్‌లోనూ థియేటర్లు హౌజ్ […]
పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఊహించిన మేర విజయవంతం కాకపోవడంతో డిస్టిబ్యూటర్లు, బయ్యర్లు లబోదిబోమంటున్నారు. ఆస్తులు తాకట్టుపెట్టి సినిమా కొన్నవారు ఇప్పుడు ఆందోళనకు సిద్ధమవుతున్నారని ఒక ప్రముఖ పత్రిక కథనం. తొలిరోజు సినిమా టాక్ న్యూట్రల్‌గా ఉన్నా రెండో రోజు నుంచి ఏకపక్షంగా నెగిటివ్ టాక్ నడించింది. రాజకీయంగా పవన్‌ను దెబ్బకొట్టడానికి కొన్ని రాజకీయ శక్తులు పనిగట్టుకుని ఈ ప్రచారం చేశాయన్న ఆరోపణలు ఉన్నాయి. నెగిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు భారీగా కుప్పకూలిపోయాయి. వీకెండ్‌లోనూ థియేటర్లు హౌజ్ ఫుల్ కాలేదు.
రెండో రోజే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి ప్రధాన సెంటర్లో సర్దార్ గబ్బర్ సింగ్ కొన్ని షోలకు హౌజ్ ఫుల్ కాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పవచ్చని డిస్టిబ్యూటర్లు అంటున్నట్టు పత్రికా కథనం. మెయిన్ థియేటర్ దేవి 70 ఎంఎంలో తొలి మూడు షోలు హౌస్ ఫుల్ కాగా.. సెకండ్ షో హౌజ్ ఫుల్ కాలేదు. సంధ్య 70ఎంఎంలో మార్నింగ్ షో మాత్రమే ఫుల్ అయింది. సంధ్య 35 ఎంఎంలోనూ పరిస్థితి ఇలాగే ఉందని కథనం. యూఎస్‌లోనూ పరిస్థితి తారుమారైందని బయ్యర్లు చెబుతున్నారు.
సమ్మర్ హాలిడేస్ కావడంతో కొందరు లాభాలు వస్తాయనే నమ్మకంతో భారీగా పెట్టుబడి పెట్టి సినిమా కొన్నారు . రెండోరోజునుంచే కలెక్షన్లు పడిపోవడం చూసి కొందరు బయ్యర్ల కాళ్ల కింద భూమి కదిలిపోతోందట. కోస్తా ప్రాంతానికి చెందిన ఓ బయ్యర్ ఏడు కోట్లకు సర్దార్‌ను కొని ఇప్పుడు కలవరపడుతున్నారట. అలాగే సీడెడ్ ప్రాంతానికి చెందిన మరో బయ్యర్ పొలాలు, తన భార్య నగలు తాకట్టుపెట్టి మరీ సినిమాను హై రేంజ్‌లో అంచనా వేసి కొనుగోలు చేసి ఇప్పుడు ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నారట.
తెలంగాణకు చెందిన డిస్ట్రిబ్యూటర్ సర్దార్ కోసం ఇంటిని తాకట్టు పెట్టినట్టు చెబుతున్నారు. ఇప్పుడు వీరంతా ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారని తెలుస్తోంది. రెండుమూడు రోజుల్లో నిర్మాతను కలిసి న్యాయం చేయాల్సిందిగా వీరంతా కోరనున్నట్టు ప్రముఖ పత్రిక కథనం. ఒకవేళ నిర్మాత స్పందించని పక్షంలో నేరుగా పవన్ వద్దకే వెళ్లి తేల్చుకోవాలని వారు భావిస్తున్నారట. ఒకవేళ అదే జరిగితే బయ్యర్లను పవన్ ఎలా ఆదుకుంటారో!. లింగా సినిమా సమయంలో రజనీకాంత్ స్పందించినట్టుగానే పవన్ కూడా స్పందిస్తారేమో చూడాలి.
Click on Image to Read: