ల్యాంకో కుదేలు ?
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నేతృత్వంలోని ల్యాంకో ఇన్‌ఫ్రా కంపెనీ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. భారీగా అప్పులు పెరిగిపోవడంతో సంస్థ తీవ్ర ఇక్కట్ల పాలవుతోంది. ఇప్పుడు కంపెనీలోని మేజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు అప్పులిచ్చిన బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంకు నేతృథ్వంలోని కన్సార్షియం ప్రత్యేకంగా భేటీ నిర్వహించి ల్యాంకో వాటా సొంతం చేసుకునేందుకు ప్రణాళిక రచిస్తోందని సమాచారం. ప్రస్తుత అంచనాల ప్రకారం ల్యాంకో గ్రూపుకు రూ. 39వేల 980 కోట్ల అప్పు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ […]
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నేతృత్వంలోని ల్యాంకో ఇన్‌ఫ్రా కంపెనీ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. భారీగా అప్పులు పెరిగిపోవడంతో సంస్థ తీవ్ర ఇక్కట్ల పాలవుతోంది. ఇప్పుడు కంపెనీలోని మేజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు అప్పులిచ్చిన బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంకు నేతృథ్వంలోని కన్సార్షియం ప్రత్యేకంగా భేటీ నిర్వహించి ల్యాంకో వాటా సొంతం చేసుకునేందుకు ప్రణాళిక రచిస్తోందని సమాచారం. ప్రస్తుత అంచనాల ప్రకారం ల్యాంకో గ్రూపుకు రూ. 39వేల 980 కోట్ల అప్పు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ మొత్తం రాబట్టుకునేందుకు తొమ్మిది బ్యాంకుల కన్సార్షియం ల్యాంకో వాటాను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. భారీ అప్పుల్లో కూరుకుపోయిన ల్యాంకో ఇన్‌ఫ్రాకు చెందిన రూ. 7000 కోట్ల రుణాలను ఇదివరకే బ్యాంకులు రెన్యువల్ చేశాయి. అప్పట్లో ఈ అంశం వివాదాస్పదమైంది. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో వాటా స్వాధీన ప్రయత్నాలకు తెరలేపారు. ప్రస్తుతం ల్యాంకో గ్రూప్‌లో 50కి పైగా అనుబంధ సంస్థలున్నాయి. వీటిలో ప్రమోటర్లకు 70.55 శాతం వాటాలుండగా, సంస్థాగత, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు 29 శాతం మేర వాటాలున్నాయి.
బయట జరుగుతున్న ప్రచారంపై ల్యాంకో కంపెనీ స్పందించింది. చర్చలు జరుగుతున్నట్టు ధృవీకరించింది. కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ (సీడీఆర్) స్కీము కింద, గతంలో రుణదాతలు ఆమోదించిన ఇతరత్రా ప్రతిపాదనల ప్రకారం కొన్ని ఆస్తుల్ని విక్రయించే ప్రక్రియ కొనసాగుతోందని సంస్థ వివరణిచ్చింది. సుమారు 8,000 మెగావాట్ల పైచిలుకు ఉత్పత్తి సామర్ధ్యం గల విద్యుత్ విభాగం పోర్ట్‌ఫోలియోకి సంబంధించి హోల్డింగ్ స్థాయిలో గానీ లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ స్థాయిలో గానీ వ్యూహాత్మక ఇన్వెస్టరును తీసుకొచ్చే దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది.
Click on Image to Read: