కేసీఆర్‌పై గీతారెడ్డికి, లక్ష్మణ్‌కు కోపమొచ్చింది..!
తెలంగాణ పీఏసీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డికి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు కేసీఆర్‌పై కోపమొచ్చింది. అసలు దాన్ని కోపం అనేకంటే ఉత్సాహం అనడం సబబేమో! విషయమేంటంటే.. ఇటీవల జరిగిన సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు తలో రెండు స్థానాలు దక్కాయి. దీంతో ఈ పార్టీల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. తాజాగా గెలిచిన నాయకులు హైదరాబాద్‌కు వచ్చి వారి అగ్రనాయకులను కలిశారు. ఈ సందర్భంగా గీతారెడ్డి కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ పతనం […]
BY sarvi13 April 2016 7:09 AM IST
X
sarvi Updated On: 13 April 2016 9:45 AM IST
తెలంగాణ పీఏసీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డికి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు కేసీఆర్‌పై కోపమొచ్చింది. అసలు దాన్ని కోపం అనేకంటే ఉత్సాహం అనడం సబబేమో! విషయమేంటంటే.. ఇటీవల జరిగిన సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు తలో రెండు స్థానాలు దక్కాయి. దీంతో ఈ పార్టీల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. తాజాగా గెలిచిన నాయకులు హైదరాబాద్‌కు వచ్చి వారి అగ్రనాయకులను కలిశారు. ఈ సందర్భంగా గీతారెడ్డి కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ పతనం సిద్దిపేట నుంచే మొదలైందని వ్యాఖ్యానించారు. ఇకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అయితే మరో అడుగు ముందుకేశారు. కేసీఆర్ ప్రతిపక్షాలు లేకుండా కుట్రలు చేస్తున్నారని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడని మండిపడ్డారు. రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చిన కేసీఆర్ ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవడం ఇప్పటికైనా ఆపాలని సూచించారు.
రెండు స్థానాలకే అంత స్పందనా!
తలోరెండు స్థానాలు గెలవగానే.. అధికార పార్టీ పతనం మొదలైందని ప్రతిపక్షాలు విమర్శించడాన్ని టీఆర్ ఎస్ నేతలు లైట్ తీసుకుంటున్నారు. ఒకటి రెండు స్థానాలకే ఇంత మిడిసిపాటు ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పతనంలో ఏ పార్టీలు ఉన్నాయో జనాలకు తెలుసని స్పష్టం చేస్తున్నారు.
Next Story