Telugu Global
CRIME

అయితే పెళ్లి...లేక‌పోతే అత్యాచారం!

ప్రేమకు చావులేదు అనే డైలాగు సినిమాల్లో మాత్ర‌మే విన‌బ‌డుతుంది. నిజ‌జీవితంలో మాత్రం అందుకు విరుద్దంగా ఉంది ప‌రిస్థితి. ప్రేమ ఫ‌లించ‌క‌పోతే  కొంత‌మంది యువ‌కుల్లో  ఆ ప్రేమ‌తో పాటు మాన‌వ‌త్వం, మంచిత‌నం కూడా చ‌చ్చిపోతున్నాయి. వాటితో పాటు ప్రేమించిన అమ్మాయినీ చంపేస్తున్నారు వారు.  మ‌రికొంద‌రు ప్రేమించిన అమ్మాయిపై అత్యాచారానికి పాల్ప‌డుతున్నారు. అలాంటి సంఘ‌ట‌నే వ‌రంగ‌ల్ జిల్లా కొప్పుల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు అందిస్తున్న స‌మాచారం ప్ర‌కారం, ఈ గ్రామానికి చెందిన ఓ యువ‌తి (20) హ‌న్మ‌కొండ‌లో బి.టెక్ […]

అయితే పెళ్లి...లేక‌పోతే అత్యాచారం!
X

ప్రేమకు చావులేదు అనే డైలాగు సినిమాల్లో మాత్ర‌మే విన‌బ‌డుతుంది. నిజ‌జీవితంలో మాత్రం అందుకు విరుద్దంగా ఉంది ప‌రిస్థితి. ప్రేమ ఫ‌లించ‌క‌పోతే కొంత‌మంది యువ‌కుల్లో ఆ ప్రేమ‌తో పాటు మాన‌వ‌త్వం, మంచిత‌నం కూడా చ‌చ్చిపోతున్నాయి. వాటితో పాటు ప్రేమించిన అమ్మాయినీ చంపేస్తున్నారు వారు. మ‌రికొంద‌రు ప్రేమించిన అమ్మాయిపై అత్యాచారానికి పాల్ప‌డుతున్నారు. అలాంటి సంఘ‌ట‌నే వ‌రంగ‌ల్ జిల్లా కొప్పుల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు అందిస్తున్న స‌మాచారం ప్ర‌కారం, ఈ గ్రామానికి చెందిన ఓ యువ‌తి (20) హ‌న్మ‌కొండ‌లో బి.టెక్ చ‌దివింది. ఆ స‌మ‌యంలో ఇదే గ్రామానికి చెందిన జ‌న్ను ప్ర‌వీణ్ ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంట‌ప‌డేవాడు. అయితే ఇది న‌చ్చ‌ని ఆ అమ్మాయి, త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. వారు ప్ర‌వీణ్‌కి బుద్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

కానీ పెద్ద‌ల ముందు పంచాయితీ పెట్టినా, పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప్ర‌వీణ్ త‌న వేధింపులు మాన‌లేదు. ఈ నేప‌థ్యంలో యువ‌తికి పెళ్లి నిశ్చ‌యం చేశారు. ప్ర‌వీణ్‌, పెళ్లికుమారుడికి ఫోన్ చేసి, అత‌డిని బెదిరించాడు. నువ్వు పెళ్లి చేసుకున్నా కిడ్నాప్ చేసైనా ఆమెను తీసుకువెళ‌తానంటూ భ‌య‌పెట్టాడు. ఆ విషయం పెళ్లి కొడుకు, యువ‌తి త‌ల్లిదండ్రుల‌కు చెప్పాడు. ప్ర‌వీణ్ అక్క‌డితో ఆగ‌కుండా సోమ‌వారం యువ‌తి ఇంటికి వ‌చ్చాడు. ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఆమెపై అత్యాచార ప్ర‌య‌త్నం చేశాడు. ఆమె అత‌ని బారినుండి త‌ప్పించుకోగ‌లిగింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

First Published:  12 April 2016 6:13 AM IST
Next Story