అంత మొనగాడు ఎవడబ్బా?
త్వరలోనే ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా నాలుగు స్థానాలను కైవసం చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. అందుకు ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలుపెట్టి ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకుంది. అయితే మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసి నాలుగో స్థానానికి పారిశ్రామికవేత్తను రంగంలోకి దింపాలని టీడీపీ భావిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభ సీటు 150 నుంచి 200 కోట్ల వరకు పలికిన దాఖలాలు కూడా ఉన్నాయంటున్నారు. […]
త్వరలోనే ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా నాలుగు స్థానాలను కైవసం చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. అందుకు ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలుపెట్టి ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకుంది. అయితే మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసి నాలుగో స్థానానికి పారిశ్రామికవేత్తను రంగంలోకి దింపాలని టీడీపీ భావిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభ సీటు 150 నుంచి 200 కోట్ల వరకు పలికిన దాఖలాలు కూడా ఉన్నాయంటున్నారు.
కాబట్టి గట్టి పారిశ్రామికవేత్తను ఎంపిక చేసి సీటును అమ్మకానికి పెట్టడం ద్వారా అటు డబ్బులు వస్తాయి… ఇటు వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కకుండా చేసిన ఆనందమూ ఉంటుందన్నది అధికార పార్టీ భావనగా ఉంది. పారిశ్రామికవేత్తను అధికార పార్టీ బరిలో దింపుతోందని మీడియాలోనూ విస్రృతంగా కథనాలు వస్తున్నాయి. అయితే ఇక్కడే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది పారిశ్రామికవేత్తలు రాజ్యసభ సీటును కొనేందుకు సిద్ధంగా ఉన్నా… వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కుని వారి బలంతో రాజ్యసభకు ఎన్నికైతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు వస్తాయని భయపడుతున్నారట.
అధికారం లేదు కాబట్టి ప్రస్తుతానికి జగన్ ఏమీ చేయలేకపోయినా 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే మాత్రం తమను వెంటాడడం ఖాయమని కొందరు ఆందోళన చెందుతున్నారట. రాజశేఖర్ రెడ్డిలాగా జగన్ పైకి కనిపిస్తున్నంత సాప్ట్ కాదని అధికారంలోకి వస్తే … తన పార్టీ ఎమ్మెల్యేలనే లోబరుచుకుని రాజ్యసభ ఎంపీ అయిన వారి పని పట్టకుండా ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏ కొంచెం తలుచుకున్నా, చంద్రబాబు మీద వున్న ఏ కేసును గట్టిగా విచారణ జరిపించినా చంద్రబాబు తప్పకుండా జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ రాజకీయాల్లో అంతటి విద్వేషాలు వద్దనుకుని రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు జోలికి వెళ్లలేదు. అలాగే చంద్రబాబుకు పెట్టని కోటలుగా వున్న కొన్ని వ్యవస్థలలోని చంద్రబాబు మనుషుల జోలికీ వెళ్లలేదు. దాంతో చంద్రబాబు అనేక ఇబ్బందులనుంచి తేలికగా బయటపడ్డాడు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఇవేమీ పట్టించుకోకుండా జగన్ ను నిర్ధాక్షిణ్యంగా జైలుకు పంపారు. ఆ కసి జగన్ లో వుంది. వచ్చే ఎన్నికల తరువాత జగన్ అధికారంలోకి వస్తే ఆ రుణం తీర్చుకునే అవకాశం వుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
జగనే అధికారంలోకి వస్తే వైసీపీ ఎమ్మెల్యేలను ఆర్థికబలంతో కొనేసి రాజ్యసభకు ఎన్నికైన పారిశ్రామికవేత్త వ్యాపార సామ్రాజ్యాలకు బీటలు పడేలా చేస్తారని అంచనా వేసుకుంటున్నారు.
ఒక రాజ్యసభ సీటుకు ఆశపడి ఎన్నో ఏళ్లుగా నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యాలను నాశనం చేసుకోవడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ టీడీపీ తెలివిగా తన ఎమ్మెల్యేలను పారిశ్రామికవేత్తలకు కేటాయించి…తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు వైసీపీ ఎమ్మెల్యేల ఓట్లను కేటాయించినా ఆ ఎత్తును అర్థం చేసుకోలేనంత అమాయకుడు జగన్ కాదని అంటున్నారు. కాబట్టి కొనుగోళ్లు, అమ్మకాల రాజకీయాలకు దూరంగా ఉండడమే బెటరని కొందరు పారిశ్రామికవేత్తలు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారట. నాలుగుకాలాల పాటు వ్యాపారం చేసుకోవాలనుకునే తెలివైన పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు మరి.
Click on Image to Read: