ఆ షాపులో అంతా కొనేవారే...అమ్మేవారు ఉండరు!
ఇలాంటి షాపులు కూడా ఉంటాయంటే నమ్మటం కష్టమే. కానీ ఉన్నాయి. కస్టమర్లు తమకు నచ్చిన ఫుడ్‌ని తీసుకుని, డబ్బుని అక్కడ ఉన్న ఒక బాక్స్‌లో వేసేయాలి. ఊహించడానికే విచిత్రంగా, అపనమ్మకంగా ఉన్నా, పూర్తిగా నమ్మకంమీద నడుస్తున్న ఇలాంటి ఓ సరికొత్త వ్యాపారం ఇప్పుడు బెంగలూరులో జోరుగా సాగుతోంది. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి ఫ్రిజ్‌లను ఇడ్లీ, దోశ, చపాతీ, పరోటాలు ఇలా ఫుడ్ ప్యాకెట్లతో నింపి ఉంచుతారు. వినియోగదారుడు ప్రిజ్‌ని ఓపెన్ చేసి తనకు కావాల్సిన ఆహారం […]
ఇలాంటి షాపులు కూడా ఉంటాయంటే నమ్మటం కష్టమే. కానీ ఉన్నాయి. కస్టమర్లు తమకు నచ్చిన ఫుడ్‌ని తీసుకుని, డబ్బుని అక్కడ ఉన్న ఒక బాక్స్‌లో వేసేయాలి. ఊహించడానికే విచిత్రంగా, అపనమ్మకంగా ఉన్నా, పూర్తిగా నమ్మకంమీద నడుస్తున్న ఇలాంటి ఓ సరికొత్త వ్యాపారం ఇప్పుడు బెంగలూరులో జోరుగా సాగుతోంది. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి ఫ్రిజ్‌లను ఇడ్లీ, దోశ, చపాతీ, పరోటాలు ఇలా ఫుడ్ ప్యాకెట్లతో నింపి ఉంచుతారు. వినియోగదారుడు ప్రిజ్‌ని ఓపెన్ చేసి తనకు కావాల్సిన ఆహారం పొట్లం తీసుకుని, దాని తలుపుకి ఉండే ఒక చిన్న బాక్సులో డబ్బుని వేసేయాలి.
అమ్మేవారు, కాపలా కాసేవారు, సిసి కెమెరాలు ఏమీ ఉండవు. ఎవరూ ఉండరు. ఐడి ఫుడ్స్ కంపెనీ స్థాపకుడు పిసి ముస్తాఫా ఆలోచన ఇది. గత నెల రోజులుగా ఆయన ఇలాంటి నమ్మకంమీద నడిచే షాపులను నగరవ్యాప్తంగా 17 స్థాపించారు. షాపంటే పెద్దగా ఏమీ ఉండదు, ఒక ఫ్రిజ్ అంతే. ఐడి ఫుడ్స్ కంపెనీలో తయారయిన ఫుడ్ ప్యాకెట్లతో నింపిన ఫ్రిజ్‌లే ఈ షాఫులు. వీటిలో టిఫిన్, భోజనం తాలూకూ ఐటమ్స్ ఉంటాయి. ఎక్కువగా నివాసిత ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌లకు సమీపంలో వీటిని నెలకొల్పారు. ఇరవై నాలుగు గంటలూ తాజా ఆహారం అందుబాటులో ఉండటం వీటి ప్రత్యేకత.
కొన్ని అపార్ట్‌మెంట్‌ల్లో 90శాతం చెల్లింపులు జరుగుతున్నాయని, మరికొన్ని చోట్ల నూరుశాతం నిజాయితీగా వినియోగదారులు డబ్బు చెల్లిస్తున్నారని ముస్తాఫా అన్నారు. అంతేకాదు, కొన్ని అపార్ట్‌మెంట్‌ల అసోసియేషన్లు దీన్ని ఛాలెంజిగా తీసుకుని, తమ ప్రాంతాల్లో అత్యంత నిజాయితీగా డబ్బు చెల్లించేలా చూస్తున్నారని ఆయన చెబుతున్నారు. మొత్తానికి ముస్తాఫా ఆహారాన్నే కాదు, పాజిటివ్ ఫీలింగ్స్‌ని కూడా అమ్ముతున్నారు. అభినందించాల్సిన విషయమే.