Telugu Global
NEWS

సీఎం భద్రతపై హెచ్చరికలు… భద్రత కట్టుదిట్టం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.  నిఘా వర్గాల హెచ్చరికలతో మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఉండవల్లి కరకట్టపై అక్రమంగా నిర్మించిన లింగమనేని నివాసంలో సీఎం ఉంటున్నారు.అయితే నివాసప్రాంతాలకు దూరంగా భవనం ఉండడం, పక్కనే నది ఉండడంతో అవాంచనీయ సంఘటనలకు అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇటీవల రాజధాని ప్రాంతంలో ఒక మావోయిస్టు పట్టుబడడంతో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.   సీఎం నివాసానికి చేరుకునే మార్గంలో ఉన్నతాధికారులు ప్రతి 100 మీటర్లకో సీసీ […]

సీఎం భద్రతపై హెచ్చరికలు… భద్రత కట్టుదిట్టం
X

ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాల హెచ్చరికలతో మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఉండవల్లి కరకట్టపై అక్రమంగా నిర్మించిన లింగమనేని నివాసంలో సీఎం ఉంటున్నారు.అయితే నివాసప్రాంతాలకు దూరంగా భవనం ఉండడం, పక్కనే నది ఉండడంతో అవాంచనీయ సంఘటనలకు అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇటీవల రాజధాని ప్రాంతంలో ఒక మావోయిస్టు పట్టుబడడంతో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. సీఎం నివాసానికి చేరుకునే మార్గంలో ఉన్నతాధికారులు ప్రతి 100 మీటర్లకో సీసీ కెమెరాను ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే జెడ్ ప్లస్ కేటరిగిలో ఉన్న చంద్రబాబుకు మరింత మందితో రక్షణ కల్పిస్తున్నారు. ఉండవల్లి కరకట్టపై చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా శక్తివంతమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు కరకట్టలో ఏకంగా ఐదు పోలీస్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. వీటిని దాటి వెళ్లడం ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఏర్పాటు చేస్తున్నారు.

కరకట్టపై నిత్యం బాంబు స్క్వాడ్‌లతో తనిఖీలు చేస్తున్నారు. చుట్టూ అరటి, ఇతర పొలాలు ఉండడంతో వాటిలోనూ స్పెషల్ పార్టీ పోలీసులు నిరంతరం సంచరిస్తూ పహారా కాస్తున్నారు. ఇప్పటికే సీఎం ఇంటికి ఒకవైపు నది ఉండడంతో బోట్ల సాయంతో పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. మొత్తం మీద కరకట్టపై చంద్రబాబుకు రక్షణ కల్పించేందుకు యంత్రాంగం చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇలా ఊరి బయట కాకుండా విజయవాడ నగరంలో సీఎం నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటే భద్రతకు ఇంతగా శ్రమించాల్సిన పని ఉండేది కాదంటున్నారు. సొమ్ము కూడా ఆదా అయ్యేది అంటున్నారు. చంద్రబాబు తన భద్రతకోసమే ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చుచేయడంపై అధికారులు వాపోతున్నారు.

Click on Image to Read:

giddi-eshwari

pawan-143

jyotula-pawan

konda-family

pawan-babu1

jammalamadugu-1

bhuma

warangal-municipal-election

MLA-Desai-Tippa-Reddy-1

pawan-political-comments

pawan abcd

First Published:  12 April 2016 5:52 AM IST
Next Story