సుజనా గ్రూప్ 7,602 కోట్ల అవినీతి ! సుప్రీంలో పిటిషనర్
కేంద్ర మంత్రి సుజనా చౌదరిని ఆర్థిక వ్యవహారాలు వెంటాడుతూనే వున్నాయి. తాజాగా చౌదరికి వ్యతిరేకంగా వినోద్‌కుమార్ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుజనా చౌదరికి సంబంధించిన సుజనా గ్రూప్ 7,602 కోట్ల రూపాయల మేర భారీ అక్రమాలకు పాల్పడిందని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించి తమ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు వున్నాయనికూడా పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినందున ప్రత్యేక ధర్యాప్తు బృందాన్నిఏర్పాటుచేసి కోర్టు పర్యావేక్షణలోనే ధర్యాప్తు జరిగేలా చూడాలని వినోద్‌కుమార్ […]
కేంద్ర మంత్రి సుజనా చౌదరిని ఆర్థిక వ్యవహారాలు వెంటాడుతూనే వున్నాయి. తాజాగా చౌదరికి వ్యతిరేకంగా వినోద్‌కుమార్ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుజనా చౌదరికి సంబంధించిన సుజనా గ్రూప్ 7,602 కోట్ల రూపాయల మేర భారీ అక్రమాలకు పాల్పడిందని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించి తమ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు వున్నాయనికూడా పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినందున ప్రత్యేక ధర్యాప్తు బృందాన్నిఏర్పాటుచేసి కోర్టు పర్యావేక్షణలోనే ధర్యాప్తు జరిగేలా చూడాలని వినోద్‌కుమార్ కోరారు. దీనికి స్పంధించిన సుప్రీంకోర్టు తొలుత సుజనా గ్రూప్ అక్రమాలపై ఆర్‌బిఐ విజిలెన్స్ సంస్థలకు ఫిర్యాదు చేయాలని పిటిషనర్‌కు సుప్రీం కోర్టు సూచించింది. ఒకవేళ ఆర్‌బిఐ స్పందించని పక్షంలో నేరుగా తమవద్దకే రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Click on Image to Read: