Telugu Global
NEWS

బాబుకు వాచీ కూడా లేదు... పవన్‌కు పూట గడవడం లేదు..!

ఫోర్బ్స్‌ పత్రిక ప్రపంచ ధనవంతుల పేర్లు ప్రకటిస్తుంది. అలాంటిదే మరేదైనా పత్రిక ప్రపంచ నిరుపేదల పేర్లు ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్‌ నుంచి చంద్రబాబు, పవన్‌ పేర్లు అందులో తప్పక వుంటాయంటున్నారు నెటిజన్‌లు. సర్దార్‌గబ్బర్‌సింగ్‌లో అన్నీ తానై వ్యవహరించి ఆ సినిమాను దెబ్బకొట్టాడు పవన్‌కల్యాణ్‌. సినిమా తేలిపోయినందుకు ఆయన బాధపడ్డాడో లేదో తెలీదుగానీ ఫ్యాన్స్‌ మాత్రం చాలా బాధపడ్డారు. ఫ్యాన్స్‌ ఆ బాధనుంచి తేరుకోకముందే పవన్‌కల్యాణ్‌ తాను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో వున్నానని, పనివాళ్లకు కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నానని ప్రకటించి […]

బాబుకు వాచీ కూడా లేదు... పవన్‌కు పూట గడవడం లేదు..!
X

ఫోర్బ్స్‌ పత్రిక ప్రపంచ ధనవంతుల పేర్లు ప్రకటిస్తుంది. అలాంటిదే మరేదైనా పత్రిక ప్రపంచ నిరుపేదల పేర్లు ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్‌ నుంచి చంద్రబాబు, పవన్‌ పేర్లు అందులో తప్పక వుంటాయంటున్నారు నెటిజన్‌లు.

సర్దార్‌గబ్బర్‌సింగ్‌లో అన్నీ తానై వ్యవహరించి ఆ సినిమాను దెబ్బకొట్టాడు పవన్‌కల్యాణ్‌. సినిమా తేలిపోయినందుకు ఆయన బాధపడ్డాడో లేదో తెలీదుగానీ ఫ్యాన్స్‌ మాత్రం చాలా బాధపడ్డారు. ఫ్యాన్స్‌ ఆ బాధనుంచి తేరుకోకముందే పవన్‌కల్యాణ్‌ తాను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో వున్నానని, పనివాళ్లకు కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నానని ప్రకటించి తాను నవ్వులపాలు అవ్వడమే కాకుండా ఫ్యాన్స్‌ను తలెత్తుకోకుండా చేశాడు.

ఆయనకు సినిమాలమీద ఏడాదికి ఎంతలేదన్నా 30, 40 కోట్లు వస్తాయి. నష్టపోవడానికి ఆయనేమీ వ్యాపారాలూ చేయడంలేదు, సొంతంగా సినిమాలు తీయడంలేదు, సంస్థలూ నడపడం లేదు. ఫ్యాన్స్‌కోసమో, ప్రజలకోసమో సేవా కార్యక్రమాలూ వెలగపెట్టడం లేదు. డబ్బు ఖర్చుపెట్టాల్సిన రాజకీయ కార్యక్రమాలు చేపట్టడంలేదు. అలాంటప్పుడు అంత డబ్బు ఎందుకు ఖర్చు అవుతుందో, పని వాళ్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆయనకే తెలియాలి. ఆయన ఆర్థిక ఇబ్బందుల స్టేట్‌మెంట్‌ మీద నెటిజన్‌లు విరుచుకుపడుతున్నారు.

ఇంక ఎంత డబ్బు వస్తే ఆయనకు ఆర్థిక ఇబ్బందులు వుండవని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నాడా అని అడుగుతున్నారు. 30 ఏళ్లనుంచి నా జేబులో రూపాయి లేదు, చేతికి వాచీ కూడా లేదు – అంత నిరాడంబరంగా బ్రతుకుతున్నానని చంద్రబాబు ప్రకటిస్తే నెటిజన్‌లు ఇలాగే మండిపడి ఆయన అవినీతి పురాణాలను ఏకరువు పెట్టారు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఇలా ప్రకటిస్తే ప్యాకేజీల గురించి ప్రజలు మాట్లాడుకోకుండా ఇలాంటి స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారా అని నిలదీస్తున్నారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్‌లో ఎక్కువ ఇబ్బంది పడుతున్నది పవన్‌ అభిమానులు.

Click on Image to Read:

konda-family

warangal-municipal-election

jammalamadugu-1

bhuma

trs-mp

MLA-Desai-Tippa-Reddy-1

pawan-political-comments

pawan abcd

kcr-kodandaram-reddy

botsa

sardar-gabbar-singh

First Published:  11 April 2016 8:14 AM IST
Next Story