కొండా సురేఖ ఆశ తీరబోతుందా?
తెలంగాణలో.. అందులోనూ వరంగల్ జిల్లాలో పరిచయం అవసరం లేని రాజకీయ నాయకులు కొండా దంపతులు. ప్రస్తుతం టీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖకు తాజా మంత్రి వర్గంలో చోటు ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి తొలి కేబినెట్‌లోనే కొండా సురేఖకు చోటు దక్కాల్సింది. కానీ, ఆమెపై తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత కారణంగా కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు విషయాన్ని వాయిదా వేశారు. తాజాగా మరోసారి మంత్రివర్గాన్ని విస్తరిస్తారని ప్రచారం జరుగుతుండటంతో కొండా పేరు […]
తెలంగాణలో.. అందులోనూ వరంగల్ జిల్లాలో పరిచయం అవసరం లేని రాజకీయ నాయకులు కొండా దంపతులు. ప్రస్తుతం టీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖకు తాజా మంత్రి వర్గంలో చోటు ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి తొలి కేబినెట్‌లోనే కొండా సురేఖకు చోటు దక్కాల్సింది. కానీ, ఆమెపై తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత కారణంగా కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు విషయాన్ని వాయిదా వేశారు. తాజాగా మరోసారి మంత్రివర్గాన్ని విస్తరిస్తారని ప్రచారం జరుగుతుండటంతో కొండా పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే కొండాసురేఖ భర్త కొండా మురళి గులాబీ పార్టీ నుంచే ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్తవానికి కొండా సురేఖకు మంత్రి పదవి, మురళికి ఎమ్మెల్సీ టికెట్ హామీపైనే వారు పార్టీలో చేరారు. ఇప్పటికే వరంగల్ నుంచి కడియం మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తాజాగా టీడీపీ నుంచి గులాబీ దళంలో చేరిన ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా మంత్రి పదవిపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు.
మొదటిసారి ఎందుకు ఇవ్వలేదంటే..?
కొండా సురేఖ మొదటి నుంచి దూకుడుగా వెళ్లే నాయకురాలు. భర్త కొండా మురళికి జిల్లాలో రాజకీయంగా మంచి పేరు ఉంది. భర్త సహకారంతో 1999లో కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలిచింది. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ఈ దంపతులపై ఉగ్రవాద నిరోధక చట్టం ( పొటా) కింద కేసు పెట్టడంతో దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. టీడీపీ చేసిన ఈ పనివల్ల వీరికి ప్రజల నుంచి అంతులేని సానుభూతి కలిగింది. యువత చేరువయ్యారు. ఆ సానుభూతే 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచేలా చేసింది. అనంతర కాలంలో వీరు వైఎస్‌కు వీరవిధేయులుగా మారారు. 2009లో అదే సురేఖకు మంత్రి పదవి తెచ్చేలా చేసింది. వైఎస్ హఠాన్మరణంతో ఆయన తనయుడు జగన్‌కు సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఒక దశలో మానుకోటలో ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడ్డారు. కానీ, ఈలోపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఫలితంగా ఉప ఎన్నికలో సురేఖ ఓడిపోయింది. తరువాత వైఎస్సార్‌సీపీ తెలంగాణ నుంచి తప్పుకోవడంతో వీరి రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. బీజేపీ విశ్వప్రయత్నాలు చేసినా.. హరీశ్ మంత్రాంగం ముందు అవేమీ నిలవలేకపోయాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులెవరూ ఉండరు కదా! ఒకప్పుడు గులాబీ పార్టికీ బద్దశత్రువులైన వీరినే.. పార్టీలోకి చేర్చుకున్నారు కేసీఆర్. మొత్తానికి త్వరలో కొండా సురేఖ మరోసారి మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Click on Image to Read: