పవన్ పై జ్యోతుల నెహ్రూ విమర్శలు
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే, కాపునేత జ్యోతుల నెహ్రూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ పై తమకు నమ్మకం లేదన్నారు. అతనిలో స్థిరత్వం కనిపించడంలేదన్నారు. పవన్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలుసుకోవడం కష్టమన్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ఒక మాట, తుళ్ళూరులో మరో మాట మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. నిన్న చెప్పినదానిపై రేపు ఏం మాట్లాడుతాడో పవన్‌కే తెలియదని జ్యోతుల నెహ్రూ ఎద్దేవా చేశారు. అయితే పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లోకి […]

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే, కాపునేత జ్యోతుల నెహ్రూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ పై తమకు నమ్మకం లేదన్నారు. అతనిలో స్థిరత్వం కనిపించడంలేదన్నారు. పవన్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలుసుకోవడం కష్టమన్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ఒక మాట, తుళ్ళూరులో మరో మాట మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. నిన్న చెప్పినదానిపై రేపు ఏం మాట్లాడుతాడో పవన్‌కే తెలియదని జ్యోతుల నెహ్రూ ఎద్దేవా చేశారు. అయితే పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలనుకోవడాన్ని స్వాగతిస్తానన్నారు. గతంలో జ్యోతుల నెహ్రూ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రజారాజ్యంలో కూడా పనిచేశారు. అంతేకాకుండా కాపు సామాజిక వర్గానికే చెందిన జ్యోతులనెహ్రూ పవన్‌పై ఇలా నేరుగా విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.
Click on Image to Read: