జమ్మలమడుగు టీడీపీలో విందు వివాదం... పోలీసుల మోహరింపు
కడపజిల్లా జమ్మలమడుగు టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరిన తరువాత పరిస్థితి నివురుగప్పిన నిప్పులా వుంది. తాజాగా ఒక విందు విషయంలో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య వైషమ్యాలను బహిర్గతం అయ్యాయి. ఆదినారాయణరెడ్డికి ప్రాబల్యం వున్న పెదదండ్లూరు గ్రామంలో టీడీపీ స్థానిక నేతలు విందు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి రామసుబ్బారెడ్డిని కూడా ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న ఆదినారాయణరెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. రామసుబ్బారెడ్డిని విందుకు ఎలా పిలుస్తారంటూ స్థానికనేతలపై విరుచుకుపడ్డారు. మీ సంగతి తేలుస్తానంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారని […]
కడపజిల్లా జమ్మలమడుగు టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరిన తరువాత పరిస్థితి నివురుగప్పిన నిప్పులా వుంది. తాజాగా ఒక విందు విషయంలో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య వైషమ్యాలను బహిర్గతం అయ్యాయి.
ఆదినారాయణరెడ్డికి ప్రాబల్యం వున్న పెదదండ్లూరు గ్రామంలో టీడీపీ స్థానిక నేతలు విందు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి రామసుబ్బారెడ్డిని కూడా ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న ఆదినారాయణరెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. రామసుబ్బారెడ్డిని విందుకు ఎలా పిలుస్తారంటూ స్థానికనేతలపై విరుచుకుపడ్డారు. మీ సంగతి తేలుస్తానంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారని సమాచారం.
ఆదినారాయణరెడ్డి హెచ్చరికతో గ్రామంలో పరిస్థితి ఉధ్రిక్తంగా మారింది. అటూ ఆదినారాయణరెడ్డి, ఇటు రామసుబ్బారెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.
రామసుబ్బారెడ్డికి ఇష్టం లేకపోయినా, తరతరాల ఫ్యాక్షన్ కక్షలను కూడా లెక్కచేయకుండా చంద్రబాబు ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి చేర్చుకున్నారు.ఇకపై తాను రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేస్తానని ఆదినారాయణరెడ్డి పలుమార్లు చెప్పారు. కానీ చేతల్లో మాత్రం ఆయన పనులకు పొంతన లేదని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలిసి పనిచేస్తానన్న ఆదినారాయణరెడ్డి చివరకు రామసుబ్బారెడ్డిని విందుకు ఆహ్వానించడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారని, దీన్ని బట్టే ఆదినారాయణరెడ్డి వ్యవహార శైలిని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. వీరిద్దరిమధ్య వున్న గొడవలు మునుముందు ఇక ఏ రూపు తీసుకుంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Click on Image to Read: