కేసీఆర్‌కు ఇబ్బందిగా మారనున్న కోదండరాం!
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో ప్రధాన ప్రతిపక్షాలు విఫలమవుతున్న వేళ టీజేఏసీ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ జేఏసీ కోదండరాం స్వయంగా పోరాటం చేయనున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా టీజేఏసీ కీలకపాత్ర పోషించింది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ ఎస్‌లు ఇతర చిన్నాచితకా పార్టీలన్నీ కోదండరాం నేతృత్వంలో ఉమ్మడిగా పోరాడుదామని నిర్ణయించాయి. కానీ, తొలుత కాంగ్రెస్, తరువాత టీడీపీ తప్పుకున్నాయి. పోరాటం కీలక దశకు చేరుకునే సరికి టీఆర్ ఎస్ కూడా అంటీముట్టనట్లే కనిపించింది. ఒకదశలో […]
BY sarvi10 April 2016 10:00 PM
X
sarvi Updated On: 11 April 2016 12:12 AM
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో ప్రధాన ప్రతిపక్షాలు విఫలమవుతున్న వేళ టీజేఏసీ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ జేఏసీ కోదండరాం స్వయంగా పోరాటం చేయనున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా టీజేఏసీ కీలకపాత్ర పోషించింది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ ఎస్‌లు ఇతర చిన్నాచితకా పార్టీలన్నీ కోదండరాం నేతృత్వంలో ఉమ్మడిగా పోరాడుదామని నిర్ణయించాయి. కానీ, తొలుత కాంగ్రెస్, తరువాత టీడీపీ తప్పుకున్నాయి. పోరాటం కీలక దశకు చేరుకునే సరికి టీఆర్ ఎస్ కూడా అంటీముట్టనట్లే కనిపించింది. ఒకదశలో టీఆర్ ఎస్ బంద్ పిలుపునిస్తే.. సరిగా స్పందించలేదు గానీ, టీజేఏసీ పిలుపునిస్తే మాత్రం ఎక్కడి తెలంగాణ అక్కడే స్తంభించిపోయింది. మేధావి, అనుభవజ్ఞుడూ అయిన కోదండరాం తన వ్యూహాలతో కేంద్రానికి ముచ్చెమటలు పట్టించాడు. ఉద్యమానికి కొత్త భాష్యం చెప్పి అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చాడు. ప్రజల్లో తెలంగాణ కాంక్ష రగిల్చింది.. కేసీఆర్ అన్నది ఎంత నిజమో.. ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లింది ముమ్మాటికీ టీజేఏసీనే అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. కోదండరాం వ్యూహాలు అంత పక్కాగా ఉంటాయి మరి.
ఎవరున్నా లేకపోయినా..
రాజకీయపార్టీలు టీజేఏసీని తాత్కాలిక శిబిరంగా మార్చుకున్నాయి తప్ప దీర్ఘకాలం దానితో కొనసాగలేదు. తొలుత కాంగ్రెస్, తరువాత టీడీపీ జేఏసీ నుంచి విడిపోయాయి. సకల జనుల సమ్మె, సాగర తీరం తదితర వినూత్న శాంతి పోరాటాలు విజయవంతంగా నడపడంతో కోదండరాంకు ప్రజల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో గులాబీ దళంలో ఆలోచన మొదలైంది. జేఏసీ నియంత్రణలో ఉంటే మనుగడ కష్టమవుతుందని ఆలోచించిన కేసీఆర్ క్రమంగా దూరంగా ఉంటున్నారు. ఈలోగా కేంద్రం నుంచి హామీ దక్కడంతో పూర్తిగా జేఏసీ నుంచి బయటికి వచ్చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ – టీజేఏసీ చైర్మన్ కోదండరాం మధ్య తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచే విభేదాలు ఉన్న మాట వాస్తవమే! అయితే, ఏనాడు వారు బయటపడ్డ దాఖలు లేవు. వీరిద్దరూ సిద్ధాంతపరంగా వ్యతిరేకులే అయినా.. ఇద్దరి ఉమ్మడి లక్ష్యం తెలంగాణే! కాబట్టి ఉద్యమంలో కలిసి పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎవరికి వారు పూర్తిగా విడిపోయారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ వైఖరి మారింది. ఆయనకు రాష్ట్ర సంక్షేమం కన్నా పార్టీ సంక్షేమం ముఖ్యమైంది. టీడీపీతో ఆయన బంధం ఊహించనంత గాఢంగా పెనవేసుకొనిపోయింది. చాలామంది తెలంగాణ వాదులకు ఇది నచ్చడంలేదు. అలాంటి వాళ్లంతా ఇప్పుడు కోదండరాం వైపు చూస్తున్నారు.
మేధావి పోరాటం ఇబ్బందే..!
కోదండరాం ఏనాడూ తనకు పేరు, పదవి కావాలనుకోలేదు. ఇప్పుడు కూడా కరువు, ఉద్యమకారుల సంక్షేమం, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి సామాన్యుల సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇవన్నీ కూడా తెలంగాణలో ప్రతి కుటుంబానికి సంబంధించినవే. జేఏసీ లేవదీసే సమస్యలను ప్రభుత్వం సకాలంలో పరిష్కరించకపోతే.. ప్రజల్లో వ్యతిరేకత ఉత్పన్నమవడం ఖాయం.
Next Story