Telugu Global
Cinema & Entertainment

ప్రధాన మంత్రికి సుమన్ లేఖ

ఒకప్పటి హీరో, ప్రస్తుత క్యారెక్టర్ ఆర్టిస్టు సుమన్… ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరం రాయడానికి రెడీ అవుతున్నాడు. హైదరాబాద్ లో జరిగిన జ్యోతిరావు పూలె జయంతి ఉత్సవాలకు సుమన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ విభాగంలో జరిగిన జ్యోతిరావు పూలే 189వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సుమన్… పూలె అంటే తనకు ఎంత అభిమానమో చెప్పుకొచ్చాడు. ఓవైపు విశాఖలో సరైనోడు ఆడియో విజయోత్సవ సభ ఉన్నప్పటికీ… కేవలం పూలెపై అభిమానంతో తను ఈ […]

ప్రధాన మంత్రికి సుమన్ లేఖ
X
ఒకప్పటి హీరో, ప్రస్తుత క్యారెక్టర్ ఆర్టిస్టు సుమన్… ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరం రాయడానికి రెడీ అవుతున్నాడు. హైదరాబాద్ లో జరిగిన జ్యోతిరావు పూలె జయంతి ఉత్సవాలకు సుమన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ విభాగంలో జరిగిన జ్యోతిరావు పూలే 189వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సుమన్… పూలె అంటే తనకు ఎంత అభిమానమో చెప్పుకొచ్చాడు. ఓవైపు విశాఖలో సరైనోడు ఆడియో విజయోత్సవ సభ ఉన్నప్పటికీ… కేవలం పూలెపై అభిమానంతో తను ఈ కార్యక్రమానికి వచ్చినట్టు స్పష్టంచేశాడు. అంతేకాకుండా…. పూలేకు సరైన గౌరవం లభించడం లేదని… ఇతర జాతీయ నాయకులకు దక్కినంత గౌరవం పూలేకు లభించడం లేదని సుమన్ ఆవేదన వ్యక్తంచేశాడు. పూలెకు సరైన గౌరవం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ… ప్రధాని మోడీకి ఉత్తరం కూడా రాస్తానని సుమన్ ప్రకటించాడు.
First Published:  11 April 2016 2:53 AM
Next Story