తెలంగాణ పోరాట యోధుడు చెన్నమనేనికి తీవ్ర అస్వస్థత!
తెలంగాణ పోరాట యోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు(92) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డిసెంబరులో ఆయన బాత్రూమ్‌లో కాలు జారిపడ్డారు. దీనికితోడు ఆయన గుండె, బీపీ, కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకరైన చెన్నమనేని రాజేశ్వరరావు ఆగస్టు 31, 1923న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, ఎల్.ఎల్.బి.పట్టా పొందారు. విద్యార్థి […]
తెలంగాణ పోరాట యోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు(92) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డిసెంబరులో ఆయన బాత్రూమ్‌లో కాలు జారిపడ్డారు. దీనికితోడు ఆయన గుండె, బీపీ, కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకరైన చెన్నమనేని రాజేశ్వరరావు ఆగస్టు 31, 1923న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, ఎల్.ఎల్.బి.పట్టా పొందారు. విద్యార్థి దశలోనే జాతీయోద్యమంలోనూ, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొన్నారు. ఆగస్టు 15, 1947న హైదరాబాదులో జాతీయజెండాను ఎగురవేశారు.
కరీంనగర్ జిల్లాలో ప్రముఖ కమ్యూనిస్టు నేతగా తిరుగులేని గుర్తింపు పొందాడు. తెలంగాణ విముక్తి పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటాల సమయంలో జైలుకు కూడా వెళ్లారు. పీడీఎఫ్ పార్టీ నుంచి సిరిసిల్ల నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో తెలుగుదేశంలో చేరి మరోసారి విజయం సాధించారు. 2009లో ఆయన కుమారుడు వైద్యుడు చెన్నమనేని రమేశ్ ఆయన స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రమేశ్ టీఆర్ ఎస్‌లో ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఈయనకు సోదరుడు కావడం విశేషం.