వారిలో ఎవరు మంత్రులవుతారు?
టీటీడీపీ నుంచి గులాబీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. దేనికోసమంటారా? ఇంక దేని కోసం.. రాష్ట్ర కేబినేట్ విస్తరణ జరగబోతుందన్న వార్తే ఇందుకు కారణం. తాము ఇంతకాలం.. ఎంతో ఆశతో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. తెలుగుదేశం నుంచి టీఆర్ ఎస్‌లో చేరిన వాళ్లలో తీగల కృష్ణారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాష్‌గౌడ్ తదితర సీనియర్ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎవరిని మంత్రి పదవి వరించనుందోనని తమలో తామే లెక్కలు వేసుకుంటున్నారు. […]
BY sarvi10 April 2016 12:12 AM GMT
X
sarvi Updated On: 10 April 2016 12:17 AM GMT
టీటీడీపీ నుంచి గులాబీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. దేనికోసమంటారా? ఇంక దేని కోసం.. రాష్ట్ర కేబినేట్ విస్తరణ జరగబోతుందన్న వార్తే ఇందుకు కారణం. తాము ఇంతకాలం.. ఎంతో ఆశతో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. తెలుగుదేశం నుంచి టీఆర్ ఎస్‌లో చేరిన వాళ్లలో తీగల కృష్ణారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాష్‌గౌడ్ తదితర సీనియర్ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎవరిని మంత్రి పదవి వరించనుందోనని తమలో తామే లెక్కలు వేసుకుంటున్నారు. తెలంగాణలో 15 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలుపొందారు. వీరిలో 12 మంది ఇప్పటికే టీఆర్ ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లో అయితే, పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఆర్. క్రిష్ణయ్య పార్టీకి ఎప్పటి నుంచో దూరంగా ఉంటున్నారు. ఇక గులాబీదండులో చేరినవారిలో అందరి కంటే ముందు తీగల కృష్ణారెడ్డికి పెద్దపీట వేయనున్నారని అనుకుంటున్నారు. తీగలపై పార్టీలో ఎలాంటి వ్యతిరేకతా లేకపోవడం, నగరంలో మంచి పేరు, కేడర్ ఉండటం ఆయనకు కలిసి రానుంది.
ఎర్రబెల్లికి ఈసారి నిరాశేనా?
మొన్నటిదాకా టీడీపీలో కీలకనేతగా కొనసాగిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి దక్కుతుందా? అన్నది ఈసారి అనుమానమే…! ఎందుకంటే ఆయన కంటే జిల్లాల్లో సీనియర్ నేతలు చాలామందే క్యూలో ఉన్నారు. పైగా పార్టీలో చేరబోయే ముందు రోజు వరకు ఆయన కేసీఆర్‌ను తిడుతూనే ఉన్నారు. ఇదంతా ప్రణాళికలో భాగంగానే జరిగిందని సర్దిచెప్పినా.. పార్టీ నాయకులు, కేడర్ కు మాత్రం జీర్ణమవడం లేదు. కాబట్టి ఈసారి ఎర్రబెల్లికి మొండిచేయి చూపక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Next Story