దేవాంశ్ నాయకత్వం వర్థిల్లాలి
సుమారు మూడు దశాబ్దాల క్రితం ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్‌గాంధీ రాజకీయ పగ్గాలు చేపట్టారు. దేశంలోని కాంగ్రెస్ వాదులెవరూ అడ్డు చెప్పక పోగా పోటీలు పడి భట్రాజు పొగడ్తలు సాగించారు. అప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చిన్నపిల్లలు. వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలని కొందరు కాంగ్రెస్ నాయకులు వేదికల నుంచి డిమాండ్ చేసే వాళ్ళు. వారసత్వ రాజకీయాలను, వంశ పారం పర్య పాలనను వ్యతిరేకించేవాళ్ళు ముఖ్యంగా కమ్యూనిస్టులు “ఇందిరాగాంధీ జిందాబాద్, రాజీవ్ గాంధీ జిందాబాద్, ప్రియాంక గాంధీ […]
సుమారు మూడు దశాబ్దాల క్రితం ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్‌గాంధీ రాజకీయ పగ్గాలు చేపట్టారు. దేశంలోని కాంగ్రెస్ వాదులెవరూ అడ్డు చెప్పక పోగా పోటీలు పడి భట్రాజు పొగడ్తలు సాగించారు. అప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చిన్నపిల్లలు. వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలని కొందరు కాంగ్రెస్ నాయకులు వేదికల నుంచి డిమాండ్ చేసే వాళ్ళు. వారసత్వ రాజకీయాలను, వంశ పారం పర్య పాలనను వ్యతిరేకించేవాళ్ళు ముఖ్యంగా కమ్యూనిస్టులు “ఇందిరాగాంధీ జిందాబాద్, రాజీవ్ గాంధీ జిందాబాద్, ప్రియాంక గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్” అంటూ వ్యంగ్యంగా నినాదాలిచ్చేవాళ్ళు. “నవ్విన నాప చేనే పండింది” అని తెలుగులో ఒక సామెత ఉంది. అలాగే వ్యంగ్యంగా అన్నా తర్వాత రాహుత్ గాంధీయే కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు అయ్యాడు.
అప్పుడు కమ్యూనిస్టులు వ్యంగ్యంగా అంటే, ఇప్పుడు తెలుగుదేశం వీరాభిమానులు దేవాంశ్ మొదటి పుట్టిన రోజు సందర్భంగా భక్తితో రకరకాల ఉపమానాలతో పొగుడుతూ ఏడాది పిల్లాడిని “యువనేత”ను చేశారు. నారా వారసుడు దేవాంశ్‌కు మోకరిల్లారు. మీడియా కూడా దేవాంశ్‌ను వీలైనంత హైలైట్ చేసింది.
ఇప్పుడు లోకేష్‌కు మంత్రిపదవి ఇవ్వకపోతే చాలామంది ఆత్మహత్యలు చేసుకునేలా ఉంది పరిస్థితి. ముందు డిమాండ్ చేస్తారు. ఆ తర్వాత నిరసనలు, దీక్షలు, త్యాగాలు. వీటన్నిటితో అధినేత మనసు కరగకపోతే ఎలాగూ ఆత్మాహుతులు ఉండనే ఉన్నాయి.
ఈ ఉద్యమానికి కొందరు దీపదారులుగా ఉంటే, మిగిలిన నారావారి భక్తులు దేవాంశ్‌ను యువనేత అని పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడానికే పరిమితం కాకుండా దేవాంశ్ నాయకత్వం వర్థిల్లాలని తెలుగునేలకు ఒక సందేశం ఇస్తారని, తద్వారా కాంగ్రెస్ వీరాభిమానులకు తామేమీ తీసిపోమని జాతి జనులు నిరూపిస్తారని కొందరు రాజకీయ పండితులు భావిస్తున్నారు.
Click on Image to Read: