పనామా పేపర్లలో అమెరికన్లు ఎందుకు లేరు?
సంచలనం సృష్టిస్తున్న పనామా పేపర్లలో ఇప్పటివరకు రష్యానుండి చైనా వరకు, బ్రిటన్ నుండి ఐస్‌ల్యాండ్ వరకు చాలాదేశాలు ఉన్నాయి కానీ వీటిలో అమెరికా నల్ల కుబేరులు మాత్రం అత్యంత తక్కువగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. పనామా పేపర్లలో అమెరికన్లు లేకపోవడానికి కారణం వారు ఆర్థిక వ్యవహారాల్లో నిజాయితీగా ఉన్నారని కాదని, అసలు ఇలాంటి వాటిలో వారు మరింత ఆరితేరినవారని అంతర్జాతీయ పరిశోధనాత్మక విలేకర్ల కూటమి డిప్యూటీ డైరక్టర్ వాల్కర్ గువేరా అన్నారు. అమెరికన్లు తమ నిధులు […]
సంచలనం సృష్టిస్తున్న పనామా పేపర్లలో ఇప్పటివరకు రష్యానుండి చైనా వరకు, బ్రిటన్ నుండి ఐస్‌ల్యాండ్ వరకు చాలాదేశాలు ఉన్నాయి కానీ వీటిలో అమెరికా నల్ల కుబేరులు మాత్రం అత్యంత తక్కువగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. పనామా పేపర్లలో అమెరికన్లు లేకపోవడానికి కారణం వారు ఆర్థిక వ్యవహారాల్లో నిజాయితీగా ఉన్నారని కాదని, అసలు ఇలాంటి వాటిలో వారు మరింత ఆరితేరినవారని అంతర్జాతీయ పరిశోధనాత్మక విలేకర్ల కూటమి డిప్యూటీ డైరక్టర్ వాల్కర్ గువేరా అన్నారు.
అమెరికన్లు తమ నిధులు దాచుకునేందుకు ఆంగ్లం మాట్లాడే దేశాలనే ఎంపిక చేసుకుంటారని, అందుకే వారి నల్లధనం స్పానిష్ మాట్లాడే పనామాలో కాకుండా బ్రిటీష్ ఐల్యాండ్స్‌కు చేరుతుందనే అభిప్రాయాలు వినబడుతున్నాయి. అమెరికన్లు నల్లధనాన్ని దాచుకోవాలంటే విదేశాలకు వెళ్లి కంపెనీలను సృష్టించాల్సిన అవసరం లేదని వారు తమ దేశంలోనే అలాంటి పనిచేయగలరని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పనామాలో కాకుండా బెర్ముడాలోనో, సింగపూర్‌లోనో అలాంటి పేపర్లు లీకయితే అందులో చాలామంది అమెరికన్లు ఉంటారని అమెరికా వెబ్‌సైట్ పొలిటికోతో మిచిగాన్ యూనివర్శిటీ లా ప్రొఫెసర్ ఒకరు అన్నారు. ఇవే కాకుండా పనామా పేపర్లలో అమెరికా లేకపోవడానికి కారణాలుగా మరిన్ని అంశాలను పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెలుగులోకి తెస్తున్నాయి.