కారు యాక్సిడెంట్ చేసిన కుర్రాడి తండ్రికీ బేడీలు!
వేగంగా కారుని నడిపి సిద్ధార్థ శర్మ అనే యువకుని మృతికి కారణమైన మైనర్ కుర్రాడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 100 కిలోమీటర్ల వేగంతో అత్యంత దూకుడుగా కారుని నడిపి, తప్పించుకోవాలని పరుగులు తీసిన సిద్ధార్థ శర్మని, మైనర్ కుర్రాడు, తన కారుతో ఢీకొట్టి చంపిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ యాక్సిడెంటు కేసులో మైనర్ కుర్రాడితో పాటు అతని తండ్రిమీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కుర్రవాడు ఒక్క సారి కాదు, […]
వేగంగా కారుని నడిపి సిద్ధార్థ శర్మ అనే యువకుని మృతికి కారణమైన మైనర్ కుర్రాడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 100 కిలోమీటర్ల వేగంతో అత్యంత దూకుడుగా కారుని నడిపి, తప్పించుకోవాలని పరుగులు తీసిన సిద్ధార్థ శర్మని, మైనర్ కుర్రాడు, తన కారుతో ఢీకొట్టి చంపిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ యాక్సిడెంటు కేసులో మైనర్ కుర్రాడితో పాటు అతని తండ్రిమీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కుర్రవాడు ఒక్క సారి కాదు, అదే ప్రాంతంలో ఇంతకుముందు కూడా యాక్సిడెంట్ చేశాడని తేలడంతో పోలీసులు అతనిమీద హత్యా నేరాన్ని నమోదు చేశారు. అలాగే ఆ కుర్రవాడికి కారునిచ్చి యాక్సిడెంట్లకు పరోక్ష కారణం అయినందుకు అతని తండ్రిని కూడా అరెస్టు చేశారు.
అంతకుముందు నిర్లక్ష్యం కారణంగా యాక్సిడెంటు చేసినట్టుగా కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం, అతనిపై ఉన్న అభియోగాన్ని తీవ్రమైన హత్యానేరంగా మార్చారు. ఆ కుర్రవాడు శుక్రవారం 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. రోడ్డు యాక్సిడెంటు చేసిన బాలుని తండ్రిని అరెస్టు చేయడం ఇదే మొదటిసారని భావిస్తున్నారు. ఒక మైనరుమీద హత్యానేరాన్ని మోపడం కూడా ఢిల్లీలో ఇదే మొదటిసారి కావచ్చని పోలీసులు తెలిపారు. గతంలో ముడు సార్లు అదే కారుని అత్యంత వేగంగా నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధించడం, నోటీసులు పంపడాన్ని పోలీసులు గుర్తించారు. అందులో ఒకసారి డ్రైవింగ్ లైసెన్సుని రద్దు చేసేంతగా రూల్సుని అతిక్రమించినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే ఆ కుర్రవాడు ఎప్పుడూ ట్రాఫిక్ అధికారుల ముందు ఆ కారు డ్రైవరుగా హాజరు కాలేదని తెలుస్తోంది.