చంద్రబాబుకు చాగంటి గారు ఈ సలహాలు కూడా ఇస్తారా?
చంద్రబాబుకు తన శక్తిసామర్ధ్యాలపై ఉన్నంత అవగాహన బహుశా మరే నేతకు లేదు కాబోలు. తన శక్తిని సరిగ్గా అంచనా వేయడంలో చంద్రబాబుకు చంద్రబాబే సాటి. మొన్నటి ఎన్నికల సమయంలోనూ ఒంటిరిగా ఎన్నికలకు వెళ్తే ఏం జరుగుతుందో స్పష్టంగా అంచనా వేయగలిగారు. అందుకే మోదీ, పవన్‌తో జత కట్టి కేవలం 5లక్షల ఓట్ల తేడాతో సీఎం కూర్చీని గెలుచుకున్నారు. అంటే జనంలో ఎవరికి ఫాలోయింగ్ ఉందో కరెక్ట్‌గా గెస్ చేయడం, వారిని తన వైపు తిప్పుకోవడంలో బాబు రాజనీతికి ఎవరూ […]
చంద్రబాబుకు తన శక్తిసామర్ధ్యాలపై ఉన్నంత అవగాహన బహుశా మరే నేతకు లేదు కాబోలు. తన శక్తిని సరిగ్గా అంచనా వేయడంలో చంద్రబాబుకు చంద్రబాబే సాటి. మొన్నటి ఎన్నికల సమయంలోనూ ఒంటిరిగా ఎన్నికలకు వెళ్తే ఏం జరుగుతుందో స్పష్టంగా అంచనా వేయగలిగారు. అందుకే మోదీ, పవన్‌తో జత కట్టి కేవలం 5లక్షల ఓట్ల తేడాతో సీఎం కూర్చీని గెలుచుకున్నారు. అంటే జనంలో ఎవరికి ఫాలోయింగ్ ఉందో కరెక్ట్‌గా గెస్ చేయడం, వారిని తన వైపు తిప్పుకోవడంలో బాబు రాజనీతికి ఎవరూ సాటిరారు.
తాజాగా ప్రముఖ ప్రవచనకారులు చాగంటి కోటేశ్వరరావు గారిపై చంద్రబాబు కన్నుపడిందన్న అనుమానం వ్యక్తమవుతోంది. తన ప్రవచనాలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి చాగంటి. ఇప్పుడు ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు చంద్రబాబు ఉగాది నాడు ప్రకటించారు. కానీ చంద్రబాబు ఈ పదవిని చాగంటి ప్రతిభనుచూసి ఇచ్చారా లేక ఆయనకున్న పాలోయింగ్‌లో తనపై మంచి అభిప్రాయం పెంచుకునేందుకు చేశారా అన్న కోణంలోనూ ఆలోచించాలి.
చాగంటి లాంటి వారిని సలహాదారులుగా పెట్టుకున్నారంటే న్యాయం, ధర్మం వంటి అంశాలపై చంద్రబాబు తప్పనిసరిగా ఒకసారి కాకపోతే మరొక సారి సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో చంద్రబాబుకు చాగంటి కోటేశ్వరరావు కొన్ని సలహాలు ఇస్తే సమాజానికి మంచిచేసిన వారవుతారు. అందులో కొన్ని.
1. రాజ్యం ఏలే నాయకుడు తండ్రితో సమానం. ప్రజలు బిడ్డలతో సమానం. బిడ్డలను తండ్రి ఎప్పుడూ మోసం చేయకూడదు. కాబట్టి ఎన్నికల సమయంలో రైతులు, మహిళలకు రుణమాఫీ పేరుతో ఇచ్చిన హామీ అమలుకు చిత్తశుద్దితో పనిచేసి రాజధర్మం పాటించమని చెప్పాలి.
2. స్త్రీ అమ్మవారిరూపం అని చాగంటి గారు చాలా సార్లుచెప్పారు. అది వెయ్యిశాతం వాస్తవమే. కాబట్టి ఇకపై ఏ నాయకుడైనా తమ అధికార బలం చూసి మహిళలపై చేయి వేస్తే రాజుల తరహాలో శిరచ్చేదనం చేయించకపోయినా… కనీసం పోలీసులు తమ పని తాము చేసుకుపోయే అవకాశం కల్పించమని సీఎంగారికి చెప్పాలి.
3.రాజు పాలన సమదృష్టితో ఉండాలి. కాబట్టి రాయలసీమ గూండాలు, పులివెందుల రౌడీలు వంటి వివక్షపూరితమైన వ్యాఖ్యలు చేయవద్దని సలహా ఇస్తే బాగుంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా..
4. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, ప్రజల నమ్మకాన్ని కోట్లకు విలువ కట్టి అమ్ముడుపోయేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలను ఫిరాయింపుల పేరుతో ప్రోత్సహించకుండా నీతి పాలన చేయాల్సిందిగా చంద్రబాబుకు సలహా ఇస్తే సమాజం హర్షిస్తుంది.
అయినా మహానుబావులు చాగంటి కోటేశ్వరరావు ఈ మంచి సలహాలు ఇచ్చినా పాటించేంత అమాయకులా చంద్రబాబు!. పార్టీల ఫిరాయింపులు ప్రోత్సహించడం, ఆడవాళ్లపై నేతలు దాడులు చేయడం వంటివన్నీ తప్పు అని చంద్రబాబుకు తెలియదా ఏమిటి?. ఒకటి మాత్రం నిజం. చాగంటి కోటేశ్వరరావును ప్రస్తుతం లక్షలాది మంది కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎంతో ఉన్నతంగా చూస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు అయిన తర్వాత చంద్రబాబు, ఆయనను కరివేపాకులా వాడుకోకుండా, టీడీపీ విధానాల నీడలు తనపై పడకుండా చూసుకునేందుకు అణుక్షణం చాగంటి కోటేశ్వరరావు అప్రమత్తంగా ఉండాల్సిందే.
-రామ్ నాథ్, నార్పల
Click on Image to Read: