భారత్ మాతాకి జై అని ఎందుకనాలి? " సురవరం
భారత్ మాతాకి జై! అంశం రోజురోజుకు తీవ్రమవుతోంది. జాతీయ స్థాయిలో ఈ అంశం తీవ్ర చర్చకు కారణమవుతోంది. ఈ విషయంలో కమ్యూనిస్టులు, మైనార్టీ నేతలు, లౌకిక పార్టీలు బీజేపీ, ఆరెస్సెస్‌ల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇదే అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా స్పందించారు. అస్సలు భారత్ మాతా కీ జై ! అని ఎందుకు అనాలో చెప్పాలని ఆర్ ఎస్ ఎస్, బీజేపీలను ఆయన డిమాండ్ చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వ […]
BY sarvi8 April 2016 6:56 AM IST
X
sarvi Updated On: 8 April 2016 7:11 AM IST
భారత్ మాతాకి జై! అంశం రోజురోజుకు తీవ్రమవుతోంది. జాతీయ స్థాయిలో ఈ అంశం తీవ్ర చర్చకు కారణమవుతోంది. ఈ విషయంలో కమ్యూనిస్టులు, మైనార్టీ నేతలు, లౌకిక పార్టీలు బీజేపీ, ఆరెస్సెస్‌ల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇదే అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా స్పందించారు. అస్సలు భారత్ మాతా కీ జై ! అని ఎందుకు అనాలో చెప్పాలని ఆర్ ఎస్ ఎస్, బీజేపీలను ఆయన డిమాండ్ చేశారు.
ఎన్‌డీఏ ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వమే ఇలాంటి కుహనా జాతీయ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈ దేశం ఏమైనా వారి అబ్బసొత్తా? వారు చెప్పినట్లు వినకపోతే.. ఇక్కడ ఉండనివ్వరా? అంటూ ప్రశ్నించారు.ఈ ప్రభుత్వం పాలనలో విఫలమైందని ఆరోపించారు. ఓ వైపు దేశంలో కరువు రాష్ట్రాలను పీడిస్తోంటే.. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి భారత్ మాతాకీ జై! అనే నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. దేశంలో టన్నుల కొద్ది ఆహార ఉత్పత్తి తగ్గిపోయిందని, చాలా ప్రాంతాల్లో తాగునీరు దొరక్క ప్రజలు విలవిల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ర్టాలను ఆదుకునే చర్యలు చేపట్టకుండా భారత్ మాతాకీ జై !అనాలనడాన్ని తప్పుబట్టారు. దేశభక్తికి ఇలాంటి నినాదాలు కొలమానాలు కావని స్పష్టం చేశారు.
Next Story