నాగం బీజేపీలోనే ఉన్నారా?
తెలంగాణ బచావో పేరిట సొంత కుంపటి పెట్టుకున్న నాగం జనార్దన్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ప్రస్తుతం ఈ ప్రశ్న విలేకరులను , బీజేపీ నేతలను వేధిస్తోంది. ఆయన బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీజేపీ నుంచి దూరంగా జరిగారు. అదే సమయంలో జాతీయ నేతల వద్ద తాను ఇంకా బీజేపీని వీడలేదని చెప్తూ వస్తున్నారు. ఇటీవల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ న్యాయస్థానాన్ని […]
BY sarvi8 April 2016 6:51 AM IST
X
sarvi Updated On: 8 April 2016 7:48 AM IST
తెలంగాణ బచావో పేరిట సొంత కుంపటి పెట్టుకున్న నాగం జనార్దన్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ప్రస్తుతం ఈ ప్రశ్న విలేకరులను , బీజేపీ నేతలను వేధిస్తోంది. ఆయన బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీజేపీ నుంచి దూరంగా జరిగారు. అదే సమయంలో జాతీయ నేతల వద్ద తాను ఇంకా బీజేపీని వీడలేదని చెప్తూ వస్తున్నారు. ఇటీవల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ కోర్టు కేసును కొట్టేయడంతో ఏం చేయాలో ఆయనకు తోచ లేదు. కేసీఆర్ ప్రభుత్వంపై మాటల దాడి చేసేందుకు ఇప్పుడు కరువు అంటూ కొత్త రాగం అందుకున్నారు. కేసీఆర్ కు పరిపాలన తెలియదు, ఆయన అనుభవ రాహిత్యం వల్ల పాలన అస్తవ్యస్తంగా మారిందని విలేకరుల సమావేశంలో ఆరో్పిస్తున్నారు. కేంద్రం కరువు సాయం రూ.300 కోట్లకు పైగా ప్రకటించిందని అన్నారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి కేంద్రం తెలంగాణకు పైసా విదిల్చింది లేదు. ఆ విషయంపై స్పష్టత ఇవ్వకుండా కేంద్రం నిధుల్ని ఏం చేస్తున్నారని వింత ప్రశ్నలు వేస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్ పై విమర్శలు చేయాలని బీజేపీ నేతలకు సూచనలు చేస్తున్నారు.
పార్టీలో ఉన్నారా? లేదా?
ఇక్కడే పాత్రికేయులు జుట్టు పీక్కుంటున్నారు. ఇంతకీ ఆయన బీజేపీని వీడారా? లేదా అన్న విషయంలో ఎవరికీ స్పష్టత రావడం లేదు. వీడకుంటే.. బీజేపీ నేతలకు ఈ సూచనలు ఎందుకు? తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని విమర్శిస్తుంటే.. బీజేపీ కంటే ముందే ఈయన స్పందిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం వ్యతిరేక పోరాటాలన్నీ.. సొంత వేదిక నుంచి చేస్తున్నారు. బీజేపీని ఇతర పార్టీల నేతలు ఏమైనా అంటే ప్రతి విమర్శలు చేయాలని కమలనాథులకు ఏ హోదాలో సూచనలు చేస్తున్నారో సొంతపార్టీ కార్యకర్తలకే అర్థం కావడం లేదు. ఈ విషయంలో వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని పాత్రికేయులు కోరుకుంటున్నారు.
Next Story