ఆస్ర్టేలియాలోనూ టీఆర్ ఎస్ పార్టీ!
తెలంగాణలో ఉద్యమ నేపథ్యంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్ పార్టీ ఇప్పుడు విస్తరించే పనిలో ఉన్నట్లుంది. ఈ విషయంలో ఎంపీ కవిత తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులను కలుపుకొనిపోవడంలో ముందున్నారు. ఇప్పటికే అమెరికా, లండన్‌లలో తెలంగాణ జాగృతి శాఖల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇక దుబాయ్, సౌదీలోని తెలంగాణ వాసుల కోసం పార్టీ తరఫున కేటీఆర్, హరీష్ అభిమానులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంతో పోలిస్తే.. ఇప్పుడు ఎడారిదేశాలకు వెళ్లిన తెలంగాణ వారికి తక్షణ సాయం అందించే […]
BY sarvi7 April 2016 4:58 AM IST
X
sarvi Updated On: 7 April 2016 5:16 AM IST
తెలంగాణలో ఉద్యమ నేపథ్యంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్ పార్టీ ఇప్పుడు విస్తరించే పనిలో ఉన్నట్లుంది. ఈ విషయంలో ఎంపీ కవిత తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులను కలుపుకొనిపోవడంలో ముందున్నారు. ఇప్పటికే అమెరికా, లండన్‌లలో తెలంగాణ జాగృతి శాఖల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇక దుబాయ్, సౌదీలోని తెలంగాణ వాసుల కోసం పార్టీ తరఫున కేటీఆర్, హరీష్ అభిమానులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంతో పోలిస్తే.. ఇప్పుడు ఎడారిదేశాలకు వెళ్లిన తెలంగాణ వారికి తక్షణ సాయం అందించే పరిస్థితి చాలా మెరుగుపడింది. అక్కడ మృత్యువాత పడ్డ కార్మికుల మృతదేహాల తరలింపు, గాయపడ్డ వారికి చికిత్స, అరెస్టయినవారిని విడిపించడంలో, వీసా సమస్యలు తలెత్తిన సమయంలోనూ ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది.
తాజాగా ఆస్ర్టేలియాలో స్థిరపడిన పలువురు తెలంగాణవాసులు ఎంపీ కవితను కలిశారు. టీఆర్ ఎస్‌ను విదేశాల్లో బలోపేతం చేసే ఆలోచనలో భాగంగా ఆస్ట్రేలియాలో పార్టీని విస్తరించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అక్కడున్న తెలంగాణ వారికి సాయమందించేందుకు, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్టీతోపాటు తెలంగాణ జాగృతి శాఖను కూడా ప్రారంభించేందుకు అనుమతించాలని కోరారు. వారి వినతిని విన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు వెంటనే పచ్చజెండా ఊపారు. ఆ వెంటనే, పార్టీ కోర్ కమిటీని ప్రకటించారు. ఇకపై ఆస్ట్రేలియాలో స్థిరపడిన తెలంగాణ వాసులకు తమకు చేతనైన సాయం చేస్తామని కవితకు వారు హామీ ఇచ్చారు.
Next Story